Lok Sabha Elections: ఒకే జిల్లాకు చెందిన ఏడుగురు ఎంపీగా గెలుపొందారు.. ఎక్కడంటే..
ABN , Publish Date - Jun 05 , 2024 | 05:06 PM
Lok Sabha Election Results 2024: ఎంతో ఉత్కంఠ రేపిన ఎన్నికల సార్వత్రిక ఎన్నికల(General Elections 2024) పర్వం ముగిసింది. వార్ వన్ సైడే అనుకున్న వారందరికీ బిగ్ షాక్ ఇచ్చాయి ఎలక్షన్ రిజల్ట్స్. ఈ ఎన్నికలు దేశ రాజకీయ చరిత్రలోనే ఎన్నో రికార్డులకు కేరాఫ్‌గా మారింది. అలాంటి రికార్డులలో ప్రత్యేకమైన ఒక అంశం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. సాధారణంగా ఒక జిల్లాలో..
Lok Sabha Election Results 2024: ఎంతో ఉత్కంఠ రేపిన ఎన్నికల సార్వత్రిక ఎన్నికల(General Elections 2024) పర్వం ముగిసింది. వార్ వన్ సైడే అనుకున్న వారందరికీ బిగ్ షాక్ ఇచ్చాయి ఎలక్షన్ రిజల్ట్స్. ఈ ఎన్నికలు దేశ రాజకీయ చరిత్రలోనే ఎన్నో రికార్డులకు కేరాఫ్‌గా మారింది. అలాంటి రికార్డులలో ప్రత్యేకమైన ఒక అంశం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. సాధారణంగా ఒక జిల్లాలో అనేక మంది రాజకీయ నాయకులు ఉంటారు. వారిలో ఎవరో కొందరు మాత్రమే పదవులను చేపట్టే అవకాశం ఉంటుంది. కానీ, ఈ జిల్లాకు చెందిన నాయకులు మాత్రం.. దేశాన్నే ఆశ్చర్యపరిచారు. ఎందుకంటే.. ఈ జిల్లాకు చెందిన కీలక నాయకులంతా ఎంపీలుగా గెలుపొందారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు నాయకులు ఎంపీలుగా గెలుపొంది పార్లమెంట్‌లో అడగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. మరి ఆ జిల్లా ఏది? ఏ రాష్ట్రంలో ఉంది? ఇంట్రస్టింగ్ వివరాలు మీకోసం..
ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం.. తొలిసారిగా జిల్లాకు చెందిన ఏడుగురు నాయకులు లోక్‌సభ ఎన్నికల్లో అద్వితీయ విజయాన్ని నమోదు చేశారు. ఈ నేతలంతా ఉత్తరప్రదేశ్‌లోని వివిధ లోక్‌సభ స్థానాల నుంచి గెలుపొందారు. అయితే, వీరందరూ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన వారే కావడం విశేషం. అందులోనూ ఇటావా జిల్లాకు చెందిన వారు కావడం మరింత విశేషం. 1999 తరువాత ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అద్భుత ప్రదర్శన చేసి ఈసారి 37 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ విజయం అఖిలేష్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీతో పాటు.. కాంగ్రెస్‌కు కూడా ఎంతో కీలకంగా మారింది.
అయితే, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఇటావాకు చెందిన ఏడుగురు నేతలు అపూర్వ రికార్డ్ నమోదు చేశారు. ఇటావా నుంచి జితేంద్ర దోహ్రే, కనౌజ్ నుంచి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, మెయిన్‌పురి నుంచి డింపుల్ యాదవ్, అజంఘడ్ నుంచి ధర్మేంద్ర యాదవ్, బదౌన్ నుంచి ఆదిత్య యాదవ్, ఫిరోజాబాద్ నుంచి అక్షయ్ యాదవ్, ఎటా నుంచి దేవేశ్ షాక్యా గెలుపొందారు.
కాగా, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో యాదవ కుటుంబానికి చెందిన ఐదుగురు అభ్యర్థులు విజయం సాధించారు. ఈ దఫా ఎన్నికల్లో అఖిలేష్ తన కుటుంబ సభ్యులకు మినహా యాదవ అభ్యర్థులకు ఎక్కువగా టిక్కెట్ ఇవ్వలేదు. అంతేకాదు.. నలుగురు ముస్లిం అభ్యర్థులను మాత్రమే రంగంలోకి దించారు. టికెట్ దక్కిన నేతలంతా ఎన్నికల్లో గెలుపొందడం విశేషం. రాంపూర్, కైరానా, మొరాదాబాద్, సంభాల్ స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ ముస్లిం అభ్యర్థులను నిలబెట్టింది. వీరంతా గెలుపొందారు.