Sangareddy: ఐఐటీ హైదరాబాద్‌కు జాతీయ ప్రతిష్ఠిత సంస్థ హోదా
ABN , Publish Date - Apr 04 , 2025 | 05:07 AM
సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిష్ఠిత సంస్థ హోదా కల్పించింది.

విరాళాలకు 100 % పన్ను మినహాయింపు
కంది, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిష్ఠిత సంస్థ హోదా కల్పించింది. ఇక నుంచి ఐఐటీహెచ్‌కు విరాళాలు ఇచ్చే దాతలకు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80జి ప్రకారం 100 శాతం పన్ను మినహాయింపు ఉంటుందని ఐఐటిహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి వెల్లడించారు. ఇకపై ఐఐటీహెచ్ ద్వారా పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు మార్గం ఏర్పడుతుందన్నారు. దాతలు, కార్పొరేట్ భాగస్వాములు, శ్రేయోభిలాషులు ముందుకు రావాలని బీఎస్ మూర్తి ఆహ్వానించారు.