Home » Smriti Irani
ప్రధాని మోదీకి కుటుంబం లేదని, పిల్లలు లేరని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు వరసగా లాలు ప్రసాద్ యాదవ్‌కు కౌంటర్ ఇస్తున్నారు. లాలు ప్రసాద్ యాదవ్‌పై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. దాణా దొంగ అయిన లాలు ప్రసాద్ యాదవ్‌కు మోదీని విమర్శించే అర్హత లేదని ధ్వజమెత్తారు.
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) గతంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో తాను గెలిస్తే అమేఠీ (Amethi) తన శాశ్వత చిరునామాగా మారుతుందని అప్పటి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టుగానే.. తన నియోజకవర్గంలో కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. గురువారం (22/02/24) తన భర్త జుబిన్ ఇరానీతో (Zubin Irani) కలిసి గృహప్రవేశం కూడా చేశారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేయాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాలు చేశారు. అమేథీ ప్రజలు ఎప్పుడో రాహుల్‌ను మరిచిపోయారని చెప్పారు.
మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనను వ్యతిరేకించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సినీ నటి కంగనా రనౌత్ మద్దతు తెలిపింది. మహిళలు ఎప్పుడూ పని చేస్తూనే ఉంటారని.. తమ కుటుంబం, కమ్యునిటీ, దేశం పట్ల...
నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్దీ కమలనాథుల్లో ఉత్సాహం పొంగిపొర్లుతోంది. మూడు రాష్ట్రాల్లో విజయానికి బీజేపీ అత్యంత చేరువలో ఉండటం వారిని ఆనందంలో ముంచెత్తుతోంది. మధ్యప్రదేశ్ , రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లలో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. మోదీ మ్యాజిక్‌కే ఈ క్రెడిట్ దక్కుతుందన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ బీజేపీ(BJP) అగ్ర నాయకత్వం రాష్ట్రానికి తరలి వస్తోంది. ఎలాగైనా గట్టి పోటీ ఇవ్వాలని చూస్తున్న బీజేపీకి జోష్ తేవాలని ఢిల్లీ నేతలు తరలివస్తున్నారు.
'మీకు ఆకలిగా ఉందా?' అని ప్రజలను అడిగి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ తయారుచేస్తోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో జరిగిన సమావేశంలో 'భారతదేశంలో మహిళల భవిష్యత్ పాత్ర' అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఇరానీ మాట్లాడారు. ఇటీవల హంగర్ ఇండెక్స్ - 2023 నివేదిక విడుదలైన క్రమంలో ఇరానీ స్పందించారు.
రాష్ట్రంలో జరిగిన అనేక కుంభకోణాల్లో కేసీఆర్ హస్తం ఉందని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ, మైనార్టీ శాఖ మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) ఆరోపించారు. దుబ్బాక పట్టణంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నారీ శక్తి
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరల్ని రూ.200 తగ్గించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిపై విపక్షాల నుంచి విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. ఇది బీజేపీ ఎన్నికల జిమ్మిక్...
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తాజాగా ఇన్స్ట్రాగ్రాంలో నిర్వహించిన ''ఆస్క్ మీ ఎనీథింగ్' కార్యక్రమంలో జుబిన్ ఇరానీతో వివాహం, ఇరానీ మాజీ భార్య మోనా గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు అంతే సూటిగా, ఒకింత ఘాటుగా సమాధానం ఇచ్చారు.