Hyderabad: బైక్‌లపై స్టంట్స్ చేస్తూ.. మహిళను భయభ్రాంతులకు గురిచేసి..
ABN , Publish Date - Apr 02 , 2025 | 10:13 AM
సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకుగాను కొంతమంది యువకులు చుట్టుపక్కల వారు భయబ్రాంతుకు గురయ్యేలా స్టంట్లు చేస్తున్నారు. నగరంలోని కోఠి ఇసామియా బజార్‌లో ఇటువంటి స్టంట్లు చేస్తున్న వారిని పోలీసులు గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు.

- వారించిన వ్యక్తిపై దురుసు ప్రవర్తన
- పోలీసుల అదుపులో ముగ్గురు
హైదరాబాద్: బైక్‌లపై స్టంట్స్ చేస్తూ మహిళను భయభ్రాంతులకు గురిచేసిన ముగ్గురు యువకులపై సుల్తాన్‌బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసాచారి(Inspector Srinivasachari) కథనం ప్రకారం.. కోఠి ఇసామియా బజార్(Kothi Isamiya Bazaar)లో మంగళవారం ఉదయం అజయ్‌కుమార్ తుల్షాన్ ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో ముగ్గురు గుర్తుతెలియని యువకులు బైక్‌లపై స్టంట్స్ చేస్తూ ఆ మార్గంలో వెళ్తున్న మహిళను భయబ్రాంతులకు గురిచేశారు.
ఈ వార్తను కూడా కూడా చదవండి: Rice: సన్నబియ్యం కోసం సందెవేళలోనూ..
తుల్షాన్ వారిని వారించగా అతడిని యువకులు దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చాదర్‌ఘాట్(Chadarghat) ప్రాంతానికి చెందిన సయ్యద్ షోయబ్(18), ఎండీ ఇర్ఫాన్ అలీ(20), మహ్మద్ అక్బర్(19)ను గుర్తించి 12 గంటల్లో అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Ipupuva Laddu: ఇప్పపువ్వు లడ్డూ!
ప్రయాణికులకు తప్పనున్న చిల్లర తిప్పలు
Read Latest Telangana News and National News