Home » Sonia Gandhi
లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపీ గౌరవ్ గొగోయ్‌కు ఆ పార్టీ మరోసారి అవకాశమిచ్చింది. చీఫ్ విప్‌గా సీనియర్ నేత కొడికున్నిల్ సురేశ్, విప్‌లుగా మాణిక్కం ఠాగూర్, మహమ్మద్ జావేద్‌లను నియమించింది.
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతినాడు ఇడుపులపాయలోని ఆయన సమాధి సాక్షిగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సోదరి, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనున్నారు. ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి కార్యక్రమానికి రేవంత్ హాజరు కానున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Y.S.Rajasekhara Reddy) 75వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 8న ఘనంగా నిర్వహించనున్నట్లు ఏఐసీసీ సీడబ్ల్యూసీ సభ్యుడు రుద్రరాజు(Rudra Raju), రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి(Mastan Vali) తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్టాన్ని అభివృద్ధిపధంలో నడిపారని రుద్రరాజు గుర్తు చేశారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని భారీ ఎత్తున నిర్వహించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, ఆయన కుమార్తె వైఎస్ షర్మిల నిర్ణయించారు. ఆ క్రమంలో వైఎస్ఆర్ జయంతి.. జులై 08వ తేదీన తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిర్వహించేందుకు ఆమె అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వ్యవహారం కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ నెల 5 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కేబినెట్లో కొత్తగా ఎవరెవరికి చోటు కల్పించాలనే విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఈ లోపే నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానంతో చర్చలు జరిపినట్లు సమాచారం. జూలై తొలి వారంలోనే రేవంత్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోచారం ఇటీవల బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి మరీ కాంగ్రెస్ కండువా కప్పారు.
ఎన్డీయే సర్కార్ మూడో సారి అధికారం చేపట్టిన తరువాత సోమవారం తొలి పార్లమెంటు సమావేశాలు(Parliament Sessions) ప్రారంభమయ్యాయి. బీజేపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్‌తో సహా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు.
రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రూ.2 లక్షల లోపు పంట రుణాలన్నింటినీ ఒకే దఫా మాఫీ చేసి, రైతులకు విముక్తి కలిగిస్తామని ప్రకటించింది. ఈ రుణాల మాఫీకి 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు ‘కట్-ఆ్‌ఫ-డేట్’గా నిర్ణయించింది.