Share News

Viral Video: ప్రపంచంలోనే అద్భుతమైన క్యాచ్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..!

ABN , Publish Date - Jul 18 , 2024 | 08:24 AM

ఇటీవల కాలంలో క్రికెట్‌లో అద్భుతమైన క్యాచ్ ఏది అని అడిగితే వెంటనే గుర్తొచ్చేది టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్. ఆ ఒక్క క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.

Viral Video: ప్రపంచంలోనే అద్భుతమైన క్యాచ్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..!
Viral Catch

ఇటీవల కాలంలో క్రికెట్‌లో అద్భుతమైన క్యాచ్ ఏది అని అడిగితే వెంటనే గుర్తొచ్చేది టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్. ఆ ఒక్క క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. అప్పటివరకు దక్షిణాఫ్రికాకు ఫేవర్‌‌గా ఉన్న మ్యాచ్.. ఆ క్యాచ్‌తో భారత్ వైపు తిరిగింది. అందుకే క్రికెట్ అభిమానులు సూర్యకుమార్‌ క్యాచ్‌ను ఎప్పటికీ మర్చిపోలేరు. సాధారణంగా క్రికెట్ గ్రౌండ్‌లో అయితే డ్రైవ్‌లు చేసి అద్భుతమైన క్యాచ్‌లు పట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొండ ప్రాంతాల్లో క్రికెట్ ఆడుతూ క్యాచ్ పట్టడమంటే మామూలు విషయమా.. కానీ పాకిస్తాన్‌కు చెందిన ఓ కుర్రాడు కొంతప్రాంతంలో సరదాగా క్రికెట్ ఆడుతూ.. పట్టిన ఓ క్యాచ్ వైరల్ అవుతోంది. ప్రపంచంలోనే అద్బుతమైన క్యాచ్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ క్యాచ్‌ను సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్‌తో పోలుస్తున్నారు క్రికెట్ అభిమానులు.

Viral Video: పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుందేమో.. రీల్స్ చేస్తూ బైకర్‌కు షాకిచ్చిన యువతి.. చివరకు..

ABN ఛానల్ ఫాలో అవ్వండి

కొండ ప్రాంతంలో..

కొంతమంది అబ్బాయిలు కొండ ప్రాంతంలో క్రికెట్ ఆడుతున్నారు. బౌలర్ బాల్ వేయగానే బ్యాట్స్‌మెన్ పెద్ద షాట్‌ కొట్టాడు, బంతి చాలా ఎత్తులో కొండ వైపునకు వెళ్లింది. సాధారణంగా అలాంటి క్యాచ్‌ని పట్టుకోవడం దాదాపు అసాధ్యం, కానీ కీపింగ్ చేస్తున్న ఓ యువకుడు అసాధ్యమైన క్యాచ్‌ను కూడా పట్టుకున్నాడు. క్యాచ్ కోసం అతడు చేసిన ప్రయత్నం అద్భుతమంటూ ఈ వీడియో చూసినవారంతా ప్రశంసిస్తున్నారు. పరుగలో వేగం, ఫిట్‌నెస్, ఫీల్డింగ్ ఈ మూడ విభాగాల్లో ఆ యువకుడు బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వ్యక్తి చిరుతపులిలా పరిగెత్తి కొండపైకి ఎక్కి అద్భుతమైన క్యాచ్‌ను ఎలా తీసుకున్నాడో తెలిపే వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.

Viral Video: కూతురు పెళ్లి ఘనంగా చేయాలనుకున్నాడు.. తీరా రాత్రి జరిగిన సీన్ చూసి అంతా షాక్..


కరాచీలో..

పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన ఫైజన్ లఖానీ అనే స్పోర్ట్స్ జర్నలిస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఈ వీడియోను పంచుకున్నారు. క్యాచ్ పట్టుకున్న యువకుడిని ప్రశంసిస్తూ, 'వాట్ ఎ క్యాచ్' అంటూ ట్యాగ్ చేశారు. ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇంత వరకు ఈ అద్భుతమైన క్యాచ్ పట్టిన బాలుడు ఎవరనే మాత్రం తెలియరాలేదు.

కేవలం 14 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు వేలాది మంది వీక్షించారు. యువకుడి క్యాచ్‌ను 'క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ క్యాచ్'గా కొందరు అభివర్ణించగా, మరొకరు ఇది చాలా బాగుంది, అద్భుతమైనది.. మళ్లీ మళ్లీ చూ-డదగినది అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.


Viral Video: కుక్క పిల్లల మధ్య డబ్ల్యూ డబ్ల్యూ ఫైట్.. సీన్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న కోళ్లు.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Viral News and Latets Telugu News

Updated Date - Jul 18 , 2024 | 08:34 AM