TANA: వాషింగ్టన్ డిసిలో తానా విజయోత్సవ సభ
ABN , Publish Date - Mar 25 , 2024 | 11:24 AM
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) విజయోత్సవ వేడుకలు శనివారం నాడు వాషింగ్టన్ డిసిలో జరిగాయి. డాకర్ట్ నరేన్ కొడాలి వర్గం, తానా సభ్యులు, శ్రేయోభిలాషులు 600 మంది పాల్గొన్నారు. తానా ఎన్నికలు జనవరి 24వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. అన్ని పదవుల్లో నరేన్ కొడాలి వర్గం విజయం సాధించింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మరో వర్గం కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిగి, తానా ఎన్నికను కోర్టు ఆమోదించింది. దాంతో మార్చి 23వ తేదీన తానా సభ్యులు బాధ్యతలు చేపట్టి, విజయోత్సవ సభ నిర్వహించారు.
ఏబీఎన్ ఇంటర్నెట్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) విజయోత్సవ వేడుకలు శనివారం నాడు వాషింగ్టన్ డిసిలో జరిగాయి. డాకర్ట్ నరేన్ కొడాలి (Naren Kodali) వర్గం, తానా సభ్యులు, శ్రేయోభిలాషులు 600 మంది పాల్గొన్నారు. తానా ఎన్నికలు జనవరి 24వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. అన్ని పదవుల్లో నరేన్ కొడాలి (Naren Kodali) వర్గం విజయం సాధించింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మరో వర్గం కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిగి, తానా ఎన్నికను కోర్టు ఆమోదించింది. దాంతో మార్చి 23వ తేదీన తానా సభ్యులు బాధ్యతలు చేపట్టి, విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ విజయోత్సవ సభను అనిల్ ఉప్పలపాటి, సాయి బొల్లినేని, సతీష్ చింత, జనార్దన్ నిమ్మలపూడి, త్రిలోక్ కంతేటి, సుధీర్ కొమ్మి, రాజేష్ కాసరనేని, వర్జీనియా నరేన్ కొడాలి మిత్రులు బృందం విజయవంతంగా నిర్వహించారు.
ఇక సహించను
‘తనను అధ్యక్ష పదవి చేపట్టకుండా రెండేళ్ల నుంచి ఇబ్బందికి గురిచేశారు. తానా ఎన్నికపై కోర్టు చుట్టూ తిప్పారు. వ్యక్తిగతంగా దూషించారు. తానా సంస్థ మీద అభిమానంతో తాను బరిలో నిలిచాను. తనకు కుటుంబం అండగా నిలబడింది. ఇకపై ఇబ్బందుల పెడితే సహించబోను. తానా ప్రతినిధిగా ప్రతిష్ట మరింత పెంచేలా కృషి చేస్తాను. తెలుగు సమాజానికి సేవ చేస్తాను అని’ డాక్టర్ నరేన్ కొడాలి (Naren Kodali) స్పష్టం చేశారు.
సభ్యులు వీరే
విజయోత్సవ సభలో గెలిచిన తానా ప్రతినిధులు శ్రీనివాస్ లావు, రవి పొట్లూరి, రాజా కసుకుర్తి, వెంకట్ కోగంటి, సునీల్ పంత్ర, లోకేష్ కొణిదెల, నాగా పంచుమర్తి, టాగోర్ మలినేని, సతీష్ కొమ్మన, ఎందురి శ్రీనివాస్, రామ్ అల్లు , వెంకట్ అడుసుమిల్లి, కె పి సొంపల్లీ, నీలిమ మన్నే, సతీష్ చింత, వెంకట్ సింగు, సురేష్ పాటి బండ్ల తదితరులు పాల్గొన్నారు. విజయోత్సవ సభకు తానా పెద్దలు జయరామ్ కోమటి, సతీష్ వేమన, శ్రీనివాస్ గోగినేని, ప్రసాద్ నల్లూరి హాజరయ్యారు.
మరిన్ని ప్రవాస వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి:
Australia: ఆస్ట్రేలియాలో శనివారం నుంచి కొత్త వీసా నిబంధనలు.. ఇక విదేశీ విద్యార్థులకు చుక్కలే!