Home » Telangana BJP
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బొర్లకుంట వెంకటేశ్ నేత బీజేపీ వైపు చూస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్ దృష్ట్యా బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టికెట్ ఇస్తే బీజేపీలో చేరతానని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి ప్రతిపాదన పెట్టారని సమాచారం. దీంతో పెద్దపల్లి అభ్యర్థిగా ప్రకటించిన గొమాసే శ్రీనివాస్‌ను మార్చి వెంకటేశ్ నేతకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది..
Telangana: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఇక రేపటి (గురువారం) నుంచి నామినేషన్ల ఘట్టం కూడా మొదలుకానుంది. దీంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటు తెలంగాణ బీజేపీ మాత్రం నామినేషన్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈసారి సరికొత్త రీతిలో నామినేషన్లను వేయించాలని బీజేపీ నిర్ణయించింది.
కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎంలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు ఆ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రధాని నరేంద్ర మోదీ మేనియాతో కేంద్రంలో మూడోసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉన్న కమలదళం నల్లగొండ స్థానంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది..
తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు ప్రస్తుతం గ్రహస్థితి అనుకూలిస్తున్నట్లు లేదు. ఓవైపు కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీనియర్ నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్, బీజేపీ(BJP)లో చేరుతున్నారు. ఇప్పటికే నాగర్‌కర్నూల్, జహీరాబాద్ ఎంపీలు రాములు, బీబీ పాటిల్‌తో పాటు మరికొంతమంది సీనియర్లు బీజేపీలో చేరగా.. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్‌లో చేరారు.
ప్రధాని నరేంద్రమోదీ మరోసారి కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సపై విమర్శనాస్త్రాలు సంధించారు.
Amit Shah Hyderabad Visit: కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) తెలంగాణ పర్యటన అంతా అత్యంత గోప్యంగా నడిచింది. షా ఎప్పుడు ఎక్కడ పర్యటిస్తారనే దానిపై సొంత పార్టీ నేతలకే క్లారిటీ లేని పరిస్థితి. మంగళవారం నాడు తెలంగాణకు వచ్చిన షా.. ముందుగా ఇచ్చిన షెడ్యూల్‌ను ఫాలో అవ్వలేదు.. మార్పులు, చేర్పులు జరుగుతూనే వచ్చాయి..
Amit Shah Public Meeting: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీ జోరు పెంచింది. ఈ ఎన్నికల్లో 12 లోక్‌సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ పార్టీ.. ఇందుకోసం వ్యూహ రచన చేస్తోంది. ఎన్నికల ముందు కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు...
Telangana Elections 2024: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ (BJP) అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మంగళవారం నాడు సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో జరుగుతున్న సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ.. తెలంగా బీజేపీ సైబర్ యోధులకు ధన్యవాదాలు తెలిపారు..
Telangana Elections 2024: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ముందు రాష్ట్రంపై (Telangana) బీజేపీ (BJP) అగ్రనేతలు దండయాత్ర చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు దక్కించుకున్న కాషాయ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ టార్గెట్‌ను మించి సీట్లు గెలవాలని వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) హైదరాబాద్‌కు విచ్చేశారు.