Home » Telangana BJP
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(KTR) బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేటీఆర్‌కు కండకావరమెక్కి తన గురించి మాట్లాడుతున్నాడంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. కరీంనగర్లో(Karimnagar) మీడియాతో మాట్లాడిన ఆయన..
BRS MLA Kale Yadaiah: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ (Congress) పార్టీ హౌస్ ఫుల్ అవుతోంది. బీఆర్ఎస్ (BRS) తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ముఖ్య నేతలు ‘కారు’ దిగి హస్తం గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మరికొందరు ముహూర్తం ఫిక్స్ చేసుకుని రెడీగా ఉన్నారు..
Telangana Parliament Elections: హైదరాబాద్ (Hyderabad) పార్లమెంట్ ఎంఐఎం అడ్డా.. 2004 నుంచి ఈ నియోజకవర్గం మజ్లిస్‌దే..!. ఒక్క మాటలో చెప్పాలంటే అసదుద్దీన్ కంచుకోట. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలిచి నిలిచారయన. అంతకుమునుపు 1984 నుంచి 2004 వరకు సుల్తాన్ సలాఉద్దీన్ ఓవైసీ ఆరు పర్యాయాలు ఎంపీగా విజయం సాధించారు. అయితే.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అసద్‌కు చెక్ పెట్టాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు దక్కడంతో కమలం పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది. ఇదే జోష్‌లో పార్లమెంట్ స్థానాలను సైతం ఎక్కువగానే సాధించాలని వ్యూహ రచన చేస్తోంది...
బీఆర్‌ఎ్‌సకు చెందిన మరో ముగ్గురు లోక్‌సభ సభ్యులూ బీజేపీలో చేరనున్నారా..? ఇప్పటికే కాషాయ కండువా కప్పుకొన్న తమ ఇద్దరు సహచర ఎంపీల బాటలోనే వారూ నడవనున్నారా..
రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ(BJP) దూకుడు పెంచింది. అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కమలం పార్టీ పావులు కదుపుతోంది. కార్యచరణలో భాగంగా శనివారం నాడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ హై కమాండ్ విడుదల చేసింది.
Telangana: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో రాజకీయం(Telangana Politics) మరింత రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఎంపీ బండి సంజయ్(MP Bandi Sanjay) చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర హుస్నాబాద్‌లో(Busnabad) తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది.
Etela Rajender Issue: తెలంగాణ ఉద్యమకారుడు, బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender).. కాషాయ కండువా తీసేసి కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకోబోతున్నారా..? అతి త్వరలోనే హస్తం గూటికి చేరుతారా..? పార్టీలో చేరిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేస్తారా..? అంటే ఇవన్నీ నిన్న, మొన్నటి వరకూ ఆయన అభిమానులు, అనుచరుల్లో మెదిలిన ప్రశ్నలు. దీనికి తోడు కాంగ్రెస్ ముఖ్యనేతలతో కలిసున్న ఫొటో కూడా నెట్టింట్లో దర్శనమివ్వడంతో ఇక ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.. పక్కాగా కండువా మార్చేస్తారని వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయ్.
BRS BJP Alliance: తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్ చేతులు కలపబోతున్నాయా? సార్వత్రిక ఎన్నికల్లో(Lok Sabha Elections) రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయా? బీజేపీతో(BJP) పొత్తుకు సంబంధించి గులాబీ దళపతి కేసీఆర్(KCR) ఇప్పటికే ఇండికేషన్స్ ఇచ్చారా? అంటే.. పొలిటికల్ సర్కిల్లో అవుననే సమాధానం బలంగా ..
బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అసెంబ్లీలో మాట్లాడుతూ.. కొన్ని నగరాల పేర్లను మార్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలని సూచించారు.
తెలంగాణ బీజేపీ శాసనసభ పక్షనేతగా ఏలేటి మహేశ్వర రెడ్డిని నియమించే అవకాశం ఉంది. ఈ మేరకు బీజేపీ అగ్రనాయకత్వం నేడు అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. ప్రస్తుతం నిర్మల్ ఎమ్మెల్యేగా ఉన్న ఏలేటి మహేశ్వర రెడ్డి.. 2009లో ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు.