Home » Telangana Congress
ఖమ్మం స్థానంపై తొలి నుంచీ చర్చ జరుగుతోంది. పార్టీ కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్న ఈ స్థానం నుంచి సోనియాగాంధీని పోటీ చేయించాలనే ప్రతిపాదన రాష్ట్ర కాంగ్రెస్ నుంచి తొలుత బలంగా ముందుకు వచ్చింది. ఈ మేరకు అధిష్ఠానానికి తెలియజేసినప్పటికీ.. అక్కడి నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. పైగా, సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు.
పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు.. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అవుతోంది. అప్పుడే కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యపోరుకు తెరలే చింది. సొంత పార్టీలోనే నేతల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి...
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బొర్లకుంట వెంకటేశ్ నేత బీజేపీ వైపు చూస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్ దృష్ట్యా బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టికెట్ ఇస్తే బీజేపీలో చేరతానని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి ప్రతిపాదన పెట్టారని సమాచారం. దీంతో పెద్దపల్లి అభ్యర్థిగా ప్రకటించిన గొమాసే శ్రీనివాస్‌ను మార్చి వెంకటేశ్ నేతకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది..
ప్రధాని నరేంద్ర మోదీ మేనియాతో కేంద్రంలో మూడోసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉన్న కమలదళం నల్లగొండ స్థానంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది..
CM Revanth Convoy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో (Kodangal) పర్యటించబోతున్నారు. హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా మార్గమధ్యలో సీఎం కాన్వాయ్‌లోని ఓ కారు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పినట్లయ్యింది. మరోవైపు.. సీఎం భద్రతా సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే ఆ టైరును రిపేరు చేయడానికి స్థానికంగా ఉన్న మెకానిక్‌ను సిబ్బంది పిలిపించారు.
ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ (Congress) ఎంపీ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్లు ఝలక్ ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించి పార్టీ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తు న్నామంటూ ఫోన్లు రావడంతో అభ్యర్థులు ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు.
ఎన్నికల్లో అక్రమాలు అంటే.. కేవలం ఓటర్లకు డబ్బులు పంచడం, ప్రలోభాలకు గురిచేయడం, రిగ్గింగ్ వంటివే కాదు! అధికార దుర్వినియోగమూ దానికిందికే వస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. అధికారులను ప్రభావితం చేసి ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేయడం,
Telangana Congress: తెలంగాణ టీడీపీ కీలక నేత నందమూరి సుహాసిని (Nandamuri Suhasini) సైకిల్ దిగి.. కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకోనున్నారా..? సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో ప్రత్యేక భేటీ వెనుక ఆంతర్యమిదేనా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే నిజమనిపిస్తోంది...
పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థులుగా ప్రకటించిన మరో ఇద్దరు నేతలు కాంగ్రె్‌సలోకి వెళ్లనున్నారా? హస్తం పార్టీలోకి వెళ్లి అక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలవనున్నారా? అంటే.. అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా
కాంగ్రెస్‌లో కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి ఎవరన్న చిక్కుముడి వీడడం లేదు. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తొమ్మిది సార్లు సమావేశమై అభ్యర్థులను ఖరారు చేసినా కరీంనగర్ అభ్యర్థి విషయం తేలడం లేదు..