Home » TG Politics
బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Birla Ilaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని చెప్పారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఓటమి ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఢిల్లీలో మీడియా చిట్‌చాట్ సందర్భంగా జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని సిర్పూర్(Sirpur) ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు(MLA Palvai Harish Babu) తెలిపారు. బ్లీచింగ్ పౌడర్ కొనేందుకు కూడా పంచాయతీల్లో నిధులు లేవంటూ వార్తలు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య లోపం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. మురుగు నిర్వహణ పనులు చేయించేందుకు కూడా నిధులు లేవా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు చాలా ప్రశాంతంగా ఉన్నానని, తాను ఇప్పుడు రిలాక్స్ అవుతున్నానని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు.
ధనిక రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పుల పాల్జేశారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (Veerlapally Shankar) ఆరోపించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అనవసరంగా రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.
రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) విమర్శించారు.
మీ పేరున ఉన్న బ్యాంకు ఖాతాల ద్వారా విదేశాలకు అక్రమంగా డబ్బు తరలించారని బెదిరించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.12 లక్షల కాజేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ట్విట్టర్(X) వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు.
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), రేవంత్‌రెడ్డి (Revanth Reddy) రేపు(శనివారం) ప్రజా భవన్ వేదికగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది.