Home » Thailand
Myanmar Earthquake: మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.
Thailand PM: ఏఐతో అనేక రకాల ప్రయోగాలు కూడా చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు కూడా ఏఐని ఉపయోగించి మోసానికి తెరలేపారు. వీరు మోసం చేసింది సామాన్య వ్యక్తిని కాదండోయ్.. ఏకంగా ఓ దేశ ప్రధానినే మోసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ ప్రధానినే చెప్పడంతో ఇప్పుడీ వార్త సంచలనంగా మారింది.
పర్యాటకం, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి థాయిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో క్యాసినో సహా జూదం వంటి అనేక ఆటలను చట్టబద్ధం చేసే ముసాయిదా బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పేటోంగ్టార్న్ షినవత్రా తనకు 400 మిలియన్ డాలర్లు సంపద ఉన్నట్టు జాతీయ అవినీతి వ్యతిరేక కమిషన్‌కు వివరాలు సమర్పించారు.
విమానాల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి మోసం చేసిన ఓ యువతి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. అయితే పోలీసుల నుంచి తప్పించుకుని తిరగడానికి ఆమె వేసిన ప్లాన్ చూసిన అధికారులు కంగుతిన్నారు.
థ్యాయ్ ల్యాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సెంట్రల్ ఉతాయ్ థాని ప్రావిన్స్ నుంచి విహార యాత్రకు వెళ్లివస్తున్న పాఠశాల బస్సులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి 25మంది చనిపోయినట్లు స్థానిక అధికారులు భావిస్తున్నారు.
అనారోగ్యానికి గురైనా మేనేజర్ సెలవు ఇవ్వకపోవడంతో ఓ యువ ఉద్యోగి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని సుఖోథాయ్‌లో జరిగింది. డెల్టా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో పని చేస్తున్న 30 ఏళ్ల మే(ఆమె పేరు) ఉద్యోగి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది.
దాదాపు రెండు గంటల పాటు కొండ చిలువతో పోరాడి పోలీసుల సహాయంతో తన ప్రాణాలను దక్కించుకుంది ఓ మహిళ. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు దక్షిణ ప్రావిన్స్‌లోని సముత్ ప్రకాశ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రస్తుత బిజీ బిజీ లైఫ్‌లో ఉద్యోగులు ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొంటున్నారు. రోజులో అత్యధిక సమయం ఆఫీస్‌లోనే గడుపుతున్నా ఉత్పాదకత మాత్రం పెరగడం లేదు. దీంతో కొన్ని కంపెనీలు రకరకాల ప్రోత్సాహకాలతో ఉద్యోగులను రీఛార్జ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
థాయ్‌లాండ్‌లో గల ఎలిఫెంట్ న్యాచురల్ పార్క్‌లో ఓ పిల్ల ఏనుగు ఫుట్ బాల్ ఆడుతోంది. ముందరి కాళ్లతో బాల్‌ను తన్నుతోంది. పక్కనే ఉన్న తల్లి ఏనుగును ఆడాలని కోరుతుంది. దాని చుట్టూ తిరుగుతోంది. అయినప్పటికీ ఆ తల్లి ఏనుగు పట్టించుకోదు. తేలికపాటి జల్లులు కురుస్తోన్న పిల్ల ఏనుగు బాల్ ఆడింది.