మయన్మార్‌లో భారీ భూకంపం
ABN, Publish Date - Mar 28 , 2025 | 01:48 PM
Myanmar Earthquake: మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.
మయన్మార్‌లో భారీ భూకంపం (Myanmar earthquake) సంభవించింది. రెక్టర్ స్కేల్‌పై దీని ప్రభావం 7.7గా నమోదు అయ్యింది. ఈ ప్రకంపనలు ఐదు నిమిషాలకు పైగా కొనసాగాయి. భూకంపం ధాటికి ఇళ్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మయన్మార్ భూకంప ప్రభావంతో పొరుగున ఉన్న బ్యాంకాక్‌లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. రెక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.3గా నమోదు అయ్యింది. ఇళ్లు, కార్యాలయాల నుంచి ప్రజలకు భయంతో బయటకు పరుగులు తీసి వీధుల్లో గుమిగూడారు. ఈ భూకంపం సముద్ర తీరానికి సమీపంలోని ఫలకాల కదలికలతో సంభవించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
థాయ్‌లాండ్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. అత్యవసర సేవల బృందాలు, అగ్నిమాపక బృందాలు, వైద్య బృందాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
Young Man Killed: పుట్టినరోజు నాడే కిరాతకం.. యువకుడి దారుణ హత్య
Vamsi Remand: వంశీకి రిమాండ్‌పై కోర్టు నిర్ణయం ఇదీ
Read Latest International News And Telugu News
Updated at - Mar 28 , 2025 | 01:51 PM