Home » Thanneeru Harish Rao
పీఏసీ చైర్మన్‌గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని అసెంబ్లీ స్పీకర్ నియమించారు. అయితే ఈ విషయంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. హరీష్‌రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లు హరీష్ రావు వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శలు చేశారు.
పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి హరీష్‌రావు సుద్దపూస కబుర్లు చెబుతున్నారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపణలు చేశారు. తెలంగాణలో పదేళ్ల పాటు ప్రజాస్వామ్యాన్ని చెరపట్టి ఇప్పుడు నీతులు బోధిస్తున్నారని విమర్శించారు.
వరదపైన బీఆర్ఎస్ పార్టీ బురద రాజకీయాలు చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. ఈరోజు(గురువారం) హైదరాబాద్‌లోని సీఎల్పీ మీడియా హాల్లో ఆది శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు.
విద్యావ్యవస్థ ఇంకా బలోపేతం కావాలని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు( Harish Rao) అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీసీ భవనంలో గురుపూజోత్సవం సందర్బంగా ఈరోజు(గురువారం) జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో హరీష్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రజలు కష్టాల్లో ఉన్నారు సహాయక చర్యల కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఇంట్లో వరద నీరు, కంట్లో ఎడతెగని కన్నీరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సంచలన విమర్శలు గుప్పించారు. మంత్రి ఉత్తమ్‌కి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్‌ను డెకాయిట్ అని ఉత్తమ్ సంభోదించడం ఆయన దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైడ్రా పేరుతో తెలంగాణలో హైడ్రామా నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పాలనను పక్కదారి పట్టించే పాలన నడుస్తోందని ఆరోపణలు చేశారు. విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారని హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు లేఖ రాశారు. వ్యవసాయంలో దన్నుగా నిలుస్తూ, పాడిసంపదతో అదనపు ఆదాయాన్ని సమకూర్చే మూగజీవాల సంరక్షణపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం శోచనీయమని మండిపడ్డారు.
పోలీస్ యాక్ట్‌తో లాఠీలతో రైతు ధర్నాలు ఆపలేరని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. ప్రజా పాలనలో ధర్నాలు నిషేధం అని రైతులకు పోలీసులు నోటీసులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. రైతులు అందరికీ ఆగస్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి మాట తప్పారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.