Home » Tirupati
పర్యాటకంలో జిల్లాకు, తిరుపతి నగరానికి ప్రాధాన్యం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలానికిగాను (2024-29) మంగళవారం ఏపీ టూరిజం పాలసీని విడుదల చేసింది.
తిరుపతి నగరంలో వరస మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. పలు కారణాలతో అదృశ్యం అవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కాగా తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుండి పారిపోయిన ముగ్గురు టెన్త్ విద్యార్థులను అన్నమయ్య జిల్లా, ములకలచెరువు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
తిరుపతిలో తల్లిదండ్రులు మందలించారని ముగ్గురు పదో తరగతి విద్యార్థులు ఇంటి నుంచి పారిపోయారు. తాము రైలు ఎక్కి వెళ్లిపోతున్నట్లు ఫోన్ చేసిన విద్యార్థులు తల్లికి సమాచారం అందించారు. ఏదో విషయంలో తప్పు చేశారని రవిశంకరాచారి, పవన్, రానా అనే ముగ్గురు కుమారులను తల్లిదండ్రులు మందలించారు.
పుత్తూరు నుంచి తమిళనాడులోని అత్తిపట్టు కొత్త రైల్వే మార్గం కోసం భూసేకరణ పనులకు రైల్వే శాఖ అనుమతిచ్చింది. 88 కిలోమీటర్ల దూరం కలిగిన ఈ రైల్వే లైనుకు 189 హెక్టార్ల భూములను సేకరించాల్సి వుంది.
తిరుమల.. బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్, శివ్ కుమార్‌లు శ్రీవారి భక్తులకు, టీటీడీకి క్షమాపణలు చెప్తూ మంగళవారం వీడియో విడుదల చేశారు. కేవలం వినోదం కోసమే ఆ వీడియో చేశామని, తిరుమల పవిత్రతను దెబ్బ తీయాలనో.. లేక భక్తుల మనోభావాలు కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని.. తెలియక చేసిన తప్పును మీరందరూ క్షమించాలని కోరుతున్నామని.. పేర్కొంటూ ప్రియాంక, శివ కుమార్ వీడియో విడుదల చేశారు.
ఎస్వీయూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ(SV University Engineering College)లో సోమవారం అన్యమత ప్రచారంపై కలకలం రేగింది. ఈఈఈ విభాగ ప్రొఫెసర్ సీహెచ్ చెంగయ్య మత ప్రచారం చేస్తున్నారంటూ భజరంగ్‌దళ్, ఏబీవీపీ ఆరోపించాయి.
తిరుపతి ఎంపీ, వైసీపీ నేత ఎం. గురుమూర్తి కేంద్రానికి లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాల్లో ఒక సమావేశాన్ని దక్షిణాదిలో నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రధానితోపాటు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక రాయలసీమ సాధనకై డిసెంబరు 27న తిరుపతి(Tirupati)లో నిర్వహిస్తున్న ‘రాయలసీమ పొలికేక’ సభకు బెంగళూరు(Bengaluru)లో స్థిరపడిన ప్రవాస రాయలసీమ వాసులు తరలిరావాలని రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి(Kuncham Venkatasubba Reddy) పిలుపునిచ్చారు.
అలిపిరి(Alipiri)లో భద్రతా తనిఖీల వైఫల్యం మరోసారి వెలుగుచూసింది. అన్యమతనానికి చెందిన వ్యాఖలతో కూడిన ఓ కారు తిరుమలకు రావడం విమర్శలకు దారితీసింది. సాధారణంగా రాజకీయ, ఇతర మతాలకు చెందిన ఫొటోలు, గుర్తులు, నినాదాలతో వాహనాలు తిరుమలకు రావడం నిషేధం.
తిరుమల మహత్యమే అలాంటిది..! ఆ ఏడుకొండల్లో పరుచుకున్న ప్రకృతి సౌందర్యం నడుమ నిల్చుంటే చాలు.. ఆధ్యాత్మిక సౌరభంతో మనసు పులకిస్తుంది.. గోవింద నామస్మరణతో తనువు పుణీతం అవుతుంది. అక్కడే శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో నెలకొల్పిన వేద విజ్ఞాన పాఠశాల ఆవరణలోకి వెళితే.. ‘వేదంలా ఘోషించే గోదావరి..’ పాట గుర్తుకు వస్తుంది.