Home » Tirupati
బియ్యం కార్డుదారుల ఈకేవైసీ నమోదుకు పౌరసరఫరాలశాఖ ఏప్రిల్ 30వ తేదీవరకు గడువు పొడిగించింది.
తిరుపతి జీవకోన ప్రాంతంలో రాజేశ్ అనే వ్యక్తి భార్య సుమతి, పిల్లలు, తల్లి విజయతో కలసి నివాసం ఉంటున్నారు. రాజేశ్, భార్య సుమతి రెండు మీ-సేవా కేంద్రాలను స్థానికంగా నిర్వహిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన భార్గవ్ మూడేళ్ల కిందట రాజేశ్ వద్ద నగదు అప్పుగా తీసుకున్నాడు.
ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో ప్రత్యేక రైళ్లను జూన్ చివరి వారం వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఆ పొడిగించిన రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
Minister Nara Lokesh: ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన దృష్టికి వచ్చిన సమస్యలపై వేగంగా పరిష్కరిస్తున్నారు. అవయవ దానం గురించి మంత్రి లోకేష్కు గుంటూరులోని రమేష్ ఆస్పత్రి వైద్యులు, సంబంధిత కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. దీంతో వెంటనే లోకేష్ రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు.
తిరుపతి : వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాత్రూంలో కాలిజారిపడి తీవ్రగాయాలయ్యాయి.
పారా మెడికల్ విద్యార్థినులను ఇద్దరు ల్యాబ్ టెక్నిషియన్లు లైంగికంగా వేధించారని 20 మంది పారా మెడికల్ విద్యార్థినులు రాతపూర్వకంగా రుయా సూపరింటెండెంటుకు పిర్యాదు చేసారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటపతి, రాజశేఖర్ను ఆర్దోపెడిక్ ఓపీ విభాగానికి బదిలీ చేశారు.
తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాల్లో పాపవినాశనం డ్యాం ఒకటి. ఈ నీరు పవిత్రమైనదిగా భక్తులు నమ్ముతారు. ఇక్కడకు వచ్చే భక్తులు ఈ నీటిలో స్నానం చేసి ఆధ్యాత్మిక శుద్ధిని పొందుతారు. అలాంటి ఈ డ్యాంలో బోటింగ్ సౌకర్యం ప్రవేశపెడితే ఇది ఒక తీర్థయాత్ర స్థలం కంటే విహార కేంద్రంగా మారే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న 32 రైళ్లకు స్టాప్లను మరో ఆరునెలల పాటు కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అలాగే.. హోలీ పండుగ నేపథ్యంలో పాట్నా-చర్లపల్లి మార్గంలో ప్రత్యేకరైళ్ల (44సర్వీసుల)ను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
SIT investigation: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తుతో టీటీడీ ఉద్యోగుల్లో గుబులు నెలకొంది. ఈ వ్యహారంలో టీటీడీ ఉద్యోగులను విచారించాలని సిట్ నిర్ణయించింది. ఈ మేరకు వారికి నోటీసులు కూడా అందజేసింది.
అలిపిరి కాలినడకమార్గంలో బుధవారం ఆరు అడుగుల నాగుపాము పట్టుబడింది. గాలిగోపురం వద్ద జనసంచారంలోకి వచ్చిన నాగుపాము భక్తులను ఆందోళన పెట్టింది. సమాచారంతో భాస్కర్ నాయుడు ఘటనా ప్రాంతానికి చేరుకుని దానిని బంధించారు.