Share News

Minister Nara Lokesh: ఆ ఒక్క మెసేజ్‌తో రంగంలోకి దిగిన మంత్రి నారా లోకేష్

ABN , Publish Date - Mar 27 , 2025 | 04:03 PM

Minister Nara Lokesh: ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన దృష్టికి వచ్చిన సమస్యలపై వేగంగా పరిష్కరిస్తున్నారు. అవయవ దానం గురించి మంత్రి లోకేష్‌కు గుంటూరులోని రమేష్ ఆస్పత్రి వైద్యులు, సంబంధిత కుటుంబ సభ్యులు మెసేజ్‌ చేశారు. దీంతో వెంటనే లోకేష్ రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు.

 Minister Nara Lokesh: ఆ ఒక్క మెసేజ్‌తో రంగంలోకి దిగిన మంత్రి నారా లోకేష్
Minister Nara Lokesh

గుంటూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన సమస్యలపై వేగంగా స్పందిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సాయం చేస్తున్నారు. లోకేష్ సేవాగుణంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా.. లోకేశ్ క్షణాల్లో స్పందించడంతో ఒకరికి అవయవ దానం, మరొకరికి ప్రాణదానం జరుగనుంది. గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మ బ్రెయిన్ డెడ్‌కు గురి అయ్యారు. దీంతో సుష్మ కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను దానం చేయడానికి నిర్ణయించుకున్నారు. సుష్మ అవయవదానంతో తిరుపతిలో మరొకరికి ప్రాణదానం జరుగనుంది.


సుష్మ గుండెను తిరుపతిలోని మరొకరికి అమర్చనున్నారు. గుంటూరు నుంచి తిరుపతికి గుండెను తరలించడానికి సొంత ఖర్చులతో మంత్రి లోకేశ్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఇవాళ(గురువారం) రాత్రి 7 గంటలకు గ్రీన్ ఛానెల్ ద్వారా గుండెను గుంటూరు రమేష్ ఆస్పత్రి సిబ్బంది తిరుపతికి తరలించనున్నారు. దీంతో గుండె మార్పిడి విజయవంతం చేయడానికి వైద్యులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. సకాలంలో స్పందించిన మంత్రి నారా లోకేశ్‌కు సుష్మ కుటుంబ సభ్యులు, రమేశ్ హాస్పిటల్స్ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Jayamangala చంద్రబాబు కాళ్ల మీద పడ్డ వైపీసీ మాజీ నేత

CM Chandrababu: పోలవరం ప్రాజెక్టు సందర్శనకు..

Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. పలు చోట్ల ఉద్రిక్తత

For More AP News and Telugu News

Updated Date - Mar 27 , 2025 | 04:38 PM