Home » Trending
చాట్‌జీపీటీపై బాస్ ఎక్కువగా ఆధారపడుతూ తన సలహాలు పట్టించుకోవట్లేదని హర్టైపోయిన ఓ అకౌంటెంట్ రాజీనామాకు సిద్ధమయ్యారు. తన ఆవేదన వెళ్లబుచ్చుకుంటూ సదరు ఉద్యోగి పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
Rat Ronin Smarter Than Human: ఎలుకల పేరెత్తగనే చాలా మంది చికాకు కలుగుతుంది. ఇవి ఇంట్లో దూరి వస్తువులను చిందర వందర చేస్తాయనేది చాలామంది అభిప్రాయం. కానీ, ఈ సూపర్ ర్యాట్ సాధారణ ఎలుకలకు భిన్నమైనది. తన ధైర్యం, తెలివితేటలతో వేలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడి గిన్నిస్ సహా ఎన్నో ప్రపంచ రికార్డులు సృష్టించింది. ఇంతకీ, అదేం చేసిందంటే..
బక్కగా ఉన్న వాళ్లకు స్పెషల్ డిస్కౌంట్ అంటూ ఓ థాయ్‌లాండ్ రెస్టారెంట్ ఇచ్చిన ప్రకటన విమర్శలకు దారి తీస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు చేసిన ఈ ప్రయత్నం మంచి అభిరుచితో కూడుకున్నది కాదని జనాలు మండిపడుతున్నారు.
నక్కినక్కి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఓ చిరుతకు కుక్క ఊహించని షాకిచ్చింది. ఫన్నీగా ఉన్న ఈ వీడియో చూసి జాలు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కాబోయే అల్లుడితో వ్యవహారం నడిపిన ఓ మహిళ పరారైపోయింది. పెళ్లికి సరిగ్గా తొమ్మిది రోజులు ఉందనంగా ఈ ఘటన జరగడంతో ఇరు కుటుంబాల్లో కల్లోలం రేగింది.
ఆన్లైన్లో మాజీ ఉద్యోగి పెట్టిన నెగెటివ్ రివ్యూ ఓ బాస్ కొంప ముంచింది. కొత్త ఉద్యోగులెవరూ చేరకపోవడంతో సంస్థ యాజమాన్యం సదరు బాస్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది.
మెట్రోలో యువకుడు మద్యం తాగుతున్నట్టు వీడియో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఘటనపై సదరు యువకుడు స్వయంగా వివరణ ఇచ్చి మరిన్ని విమర్శల పాలయ్యారు.
ప్రసవం తరువాత భార్య దగ్గరకు రానీయకపోవడంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. రోజుల వయసున్న పసిబిడ్డను అడవిలో వదిలేసే ప్రయత్నం చేశాడు. థాయ్‌లాండ్‌లో ఈ దారుణం వెలుగు చూసింది.
అర్ధరాత్రి పన్ను నొప్పి మొదలు కావడంతో ఓ వ్యక్తి భరించలేకపోయాడు. డాక్టర్ అపాయింట్మెంట్ దొరకక సతమతమయ్యాడు. చివరకు తన పన్ను తానే తొలగించుకున్నాడు. బ్రిటన్ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది.
తనకు కాబోయే భర్త తండ్రిని చూడగానే యువతికి భారీ షాక్ తగిలింది. ఆయనతో గతంలో డేటింగ్ చేసిన విషయం బాయ్‌ఫ్రెండ్‌తో ఎలా చెప్పాలో తెలీక దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయింది. స్కాట్లాండ్లో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది.