Home » TS News
Telangana: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 3,00,995 క్యూసెక్కులు ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రస్తుత నిల్వ సామర్థ్యం 298.300 టీఎంసీలుగా ఉంది.
అత్తాపూర్‌లోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవేపై గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఈసారి మాత్రం ఓ వ్యక్తి ఆ ఫ్లై ఓవర్ పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా పలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. నిన్న కాగ్నిజెంట్ సీఈఓతో పాటు సిగ్న కంపెనీ సీనియర్లతో రేవంత్ చర్చలు జరిపారు.
Telangana: హైదరాబాద్‌లో నీట్ అభ్యర్థుల స్థానికత రగడ చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తెచ్చిన జీఓతో స్థానికత కోల్పోతున్నామని విద్యార్థులు ఆందోళనకు దిగారు. 6 -12 తరగతి వరకు చదివిన వాటిలో వరసగా నాలుగు తరగతుల ఆధారంగా స్థానికత ఇవ్వాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం 9,10, ఇంటర్ చదివిన ఆధారంగా స్థానికత నిర్ణయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana: దళిత మహిళపై పోలిసుల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పోలీసుల తీరుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎమ్మెల్యే స్పందిస్తూ.. ‘‘దళిత మహిళపై ఇంత దాష్టీకమా? ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన? దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా?
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌పై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. నత్తనడకన సాగుతున్న ఉప్పల్ ఫ్లైఓవర్‌కు త్వరలో మోక్షం లభించనుంది. 20 నెలల్లో పనులు పూర్తి చేస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
Telangana: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. వరద నీరు అధికంగా పోటెత్తడంతో గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఈరోజు ఉదయం సాగర్ గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్న కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 13, 14 గేట్లను ఎత్తివేశారు. ఈ రెండు గేట్లను దాదాపు ఐదు అడుగుల మేర ఎత్తేవేసి నీటిని విడుదల చేశారు.
Telangana: ఢిల్లీ మద్యం కుంభకోణం సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు డిఫాల్ట్ బెయిల్‌పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగనుంది. నిర్దేశిత 60 రోజుల గడవులో పూర్తి స్థాయి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయడంలో సీబీఐ విఫలం అయ్యిందని జూలై 8న కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు కాగ్నిజెంట్ సీఈఓతో సీఎం భేటీ అవుతారు. సిగ్న కంపెనీ సీనియర్లతో రేవంత్ చర్చలు జరుపనున్నారు. అమెరికాలో ఉన్న కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియాతో లంచ్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. అలాగే పలు కంపెనీల ఓనర్లతో తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఎన్ఆర్ఐ లు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఉరకలెత్తుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ నాగార్జునసాగర్ జలాశయానికి వడివడిగా చేరుతోంది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2 గంటలకు నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకోనున్నాయి