Share News

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు మరోసారి చుక్కెదురు

ABN , Publish Date - Aug 10 , 2024 | 10:08 AM

Telangana: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కుదురైంది. ఈ కేసులో నిందితులు బెయిల్‌ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు పిటిషన్‌ విచారణకు రాగా.. నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. అలాగే నలుగురు నిందితుల బెయిల్‌ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 తిరుపతన్న, ఏ4 భుజంగరావు, ఏ5 రాధాకిషన్‌రావు బెయిల్‌ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు మరోసారి చుక్కెదురు
Phone Tapping Case

హైదరాబాద్‌, ఆగస్టు 10: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) నిందితులకు చుక్కుదురైంది. ఈ కేసులో నిందితులు బెయిల్‌ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు పిటిషన్‌ విచారణకు రాగా.. నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు (Nampalli Court) నిరాకరించింది. అలాగే నలుగురు నిందితుల బెయిల్‌ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 తిరుపతన్న, ఏ4 భుజంగరావు, ఏ5 రాధాకిషన్‌రావు బెయిల్‌ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసులు తెలియజేశారు. ఈ క్రమంలో పోలీసుల వాదనలతో నాంపల్లి కోర్టు ఏకీభవిస్తూ బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసింది.

Alla Nani: ఆళ్ల నాని రాజీనామా వెనుక ఏం జరిగింది.. వాట్ నెక్స్ట్!?


కాగా.. ఈ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావే ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చిన విషయం తెలిసిందే. ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఫోన్ టాపింగ్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఫోన్ టాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లిపోయాడు. దీంతో ప్రభాకర్ రావు ఆచూకీ కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. లుక్ అవుట్ నోటీసులకు స్పందన లేకపోవడంతో.. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అలాగే ఈ కేసులో ప్రణీత్ రావు ఏ2గా, తిరుపతన్న ఏ3గా, భుజంగరావు ఏ4గా, రాధాకిషన్ రావు ఏ5గా ఉన్నారు.

Manish Sisodia: భార్యతో సెల్ఫీ తీసుకుని.. తనదైన శైలిలో స్పందించిన మనీశ్


అలాగే ఈ కేసులో అరెస్ట్ అయి చంచల్‌గూడ జైలులో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదు అయ్యింది. నాంపల్లి కోర్టులో పీటీ వారెంట్‌పై పోలీసులు రిమాండ్ చేశారు. యజమానిని కిడ్నాప్‌ చేసి క్రియా హెల్త్‌ కేర్‌ సంస్థలో కోట్ల విలువైన షేర్లను నలుగురు డైరెక్టర్ల మీదకు బలవంతంగా బదిలీ చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంస్థ వ్యవస్థాపకుడు చెన్నుపాటి వేణుమాధవ్‌ ఫిర్యాదుతో కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో రాధాకిషన్‌రావుతో పాటు మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు సహా చంద్రశేఖర్‌, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీలపై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు.


ఇవి కూడా చదవండి...

Hyderabad: మ్యాట్రిమోనీ సైట్‌లో అమ్మాయిల నకిలీ వివరాలతో మోసం..

Viral Video: గంటకు 800కి.మీ వేగంతో దూసుకెళ్లే విమానం.. పైనుంచి చూడగా గుండె ఆగిపోయే సీన్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 10 , 2024 | 10:13 AM