Home » TS News
Telangana: మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడికి కొదవేముంది. ఎన్నిరకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేస్తూనే ఉంటారు కేటుగాళ్లు. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొందరు మోసగాళ్ల వలలో చిక్కుతుంటారు. భూములు, డబ్బులు, నగదు ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో రకాలుగా కేటుగాళ్లు మోసానికి పాల్పడుతుంటారు. ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో అయితే మరింతగా మోసాలు జరుగుతూ ఉంటాయి.
Telangana: ద్రవ్యవినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీ రేపటి(గురువారం)కి వాయిదా పడింది. ఈరోజు ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిల్లుపై చర్చను మొదలుపెట్టారు.
Telangana: శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. బుధవారం త్రిపుర నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న నూతన గవర్నర్‌కు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాలల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు హర్కార వేణుగోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
Telangana: అసెంబ్లీ గన్‌పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం అసెంబ్లీని ముట్టడించేందుకు పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నేతలు యత్నించారు. అసెంబ్లీ వద్దకు చేరుకున్న వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 30శాంత నిధులు కేటాయించాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
సభను తప్పుదోవ పట్టించటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవడానికి చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సూచన అనే ముసుగులో మోసం అనే ప్రణాళికను ప్రజల మెదళ్లలో జొప్పిస్తున్నారన్నారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై వాడీ వేడీ చర్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు కురిపించారు. అలాగే రాష్ట్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిందని... అందరినీ వెన్నుపోటు పొడిచిందని.. ఈ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతా అంటూ కేసీఆర్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఆపై ద్రవ్య వినిమయ బిల్లుపై సభలో చర్చ ప్రారంభమైంది. బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ చర్చను మొదలుపెట్టారు. పదేళ్ల క్రితం కిరణ్‌కుమార్‌రెడ్డి..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజూ వాడీవేడీగానే ప్రారంభమయ్యాయి. మంగళవారం లాగే.. ఇవాళ కూడా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. దవ్య వినిమయ బిల్లుకుపై చర్చ జరుగుతోంది.
Telangana: ‘‘ది కాంటినెంటల్’’ రిసార్ట్ లో లిక్కర్ పార్టీపై ఎక్సైజ్ పోలీసులు ప్రకటనను విడుదల చేశారు. రిసార్ట్‌లో లిక్కర్ పార్టీ నడుస్తుంది అన్న సమాచారంతో రైడ్స్ నిర్వహించామన్నారు. లిక్కర్ పార్టీ నిర్వహించిన సుధీర్ కుమార్, షేక్ సుభానిపై కేసు నమోదు చేశామని తెలిపారు. దాడుల్లో భాగంగా మొత్తం 11.2 లీటర్ల మద్యం, 7.15 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నామన్నారు. 7
నేడు ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. నేడు కూడా ప్రశ్నోత్తరాల రద్దు కార్యక్రమం జరుగనుంది.