Share News

Kavitha: కవితకు బెయిల్‌పై సర్వత్రా ఉత్కంఠ.. నేడే విచారణ

ABN , Publish Date - Aug 05 , 2024 | 11:04 AM

Telangana: ఢిల్లీ మద్యం కుంభకోణం సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు డిఫాల్ట్ బెయిల్‌పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగనుంది. నిర్దేశిత 60 రోజుల గడవులో పూర్తి స్థాయి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయడంలో సీబీఐ విఫలం అయ్యిందని జూలై 8న కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.

Kavitha: కవితకు బెయిల్‌పై సర్వత్రా ఉత్కంఠ.. నేడే విచారణ
MLA Kavitha Bail Pitition

న్యూఢిల్లీ, ఆగస్టు 5 : ఢిల్లీ మద్యం కుంభకోణం సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు డిఫాల్ట్ బెయిల్‌పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగనుంది. నిర్దేశిత 60 రోజుల గడవులో పూర్తి స్థాయి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయడంలో సీబీఐ విఫలం అయ్యిందని జూలై 8న కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. లిక్కర్ కేసులో కవితను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే..ఢిల్లీ లిక్కర్ కేసు ఈడీ కేసులోనూ కవితకు జ్యుడీషియల్ రిమాండ్‌ను ఆగస్టు 13 వరకు కోర్టు పొడిగించింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు.

TDP Vs YSRCP: మాజీ మంత్రి పెద్దిరెడ్డి కంచుకోటలో టీడీపీ మాస్టర్ ప్లాన్!



కాగా.. జూలై 22న జరిగిన విచారణలో సీబీఐ కవితను 2024 ఏప్రిల్ 11న అక్రమంగా అరెస్టు చేసిందని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. జూన్ 7న సీబీఐ అసంపూర్తి ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు. సీబీఐ చార్జ్‌షీటులో తప్పులు ఉన్నాయని కోర్టు కూడా పేర్కొంది. సీఆర్పీసీ167(2) ప్రకారం కవిత డిఫాల్ట్ బెయిల్ పొందే హక్కు ఉందని... ఏడు ఏళ్ళ శిక్ష పడే కేసులో 60 రోజుల వరకు మాత్రమే కస్టడీకి అవకాశం ఉందని... తాము డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జూలై 6 తేదీ నాటికి కవిత 86 రోజుల కస్టడీ పూర్తి అయ్యిందని ఢిల్లీ కోర్టులో కవిత తరపు న్యాయవాదులు గతంలో వాదనలు వినిపించారు.

CM Revanth Reddy: అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ బిజీబిజీ


మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవిత దాదాపు నాలుగు నెలలుగా తీహార్ జైలులోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేసులు నమోదు చేసిన సీబీఐ, ఈడీ... కవితను అదుపులోకి తీసుకున్నాయి. అయితే కవిత అరెస్ట్ నాటి నుంచి బెయిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అనేక మార్లు బెయిల్ మంజూరు చేయాలంటూ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాదులు పిటిష వేయగా.. వాటిని కోర్టుకు తిరస్కరించిన విషయం తెలిసిందే. తాజాగా కవిత తరపున లాయర్లు కీలకమైన అంశాన్ని బెయిల్ పిటిషన్‌లో పొందుపరుస్తూ డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. నిర్దేశిత 60 రోజుల గడువులో పూర్తి స్థాయి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయడంలో సీబీఐ విఫలం అయ్యిందంటూ కవిత తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. మరి ఈరోజు జరిగే విచారణలో కవితకు బెయిల్ మంజూరు అవుతుందా?... లేదా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.


కవితతో ములాఖత్...

మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు,జగదీశ్వర్ రెడ్డి పలువురు బీఆర్‌ఎస్ నేతలు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తీహార్ జైల్లో ఉన్న కవితతో బీఆర్‌ఎస్ నేతలు ములాఖత్ కానున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి గత ఐదు నెలలుగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ములాఖత్‌లో భాగంగా కవితను బీఆర్ఎస్ నేతలు కలిసి ఆమెకు ధైర్యం చెప్పనున్నారు.


ఇవి కూడా చదవండి...

Rythu Runa Mafi: అక్షరం తేడా ఉన్నా.. మాఫీ కాని రుణం!

Article 370: అయిదో వార్షికోత్సవం.. బీజేపీ ర్యాలీ.. అమర్నాథ్ యాత్ర నిలిపివేత

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2024 | 11:04 AM