Home » TS News
తెలంగాణలో పలువురు డీఎస్పీ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ఇవాళ (గురువారం) ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న అధికారి ఎస్ఆర్ దామోదర్ రెడ్డిని అంబర్పేట్ డీఎస్పీ, పీటీసీగా బదిలీ చేశారు. ప్రస్తుతం జగిత్యాల డీఎస్పీ, డీసీఆర్బీగా ఉన్న జీ మహేశ్ బాబుని కరీంనగర్ డీఎస్పీ, పీటీసీగా బదిలీ చేశారు.
జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్లో ఉన్న శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాళ (శుక్రవారం) కీలక ప్రక్రియ ముగిసింది. ఆలయానికి సంబంధించిన టెంకాయలు, వసతి గృహాల నిర్వహణ, మరుగుదొడ్లు నిర్వహణ, షాపులకు, పార్కింగ్ స్థలాల నిర్వహణకు సంబంధి వేలంపాట ప్రక్రియ జరిగింది.
ఆకలి కావడంతో ఆహారం దొరకక మానసికస్థితి సరిగ్గా లే ని ఓ వ్యక్తి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం(Nampally Exhibition Ground)లోని దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. అక్కడ ఉన్న సామగ్రిని చిందరవందర చేశాడు.
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. జనగామ కాంగ్రెస్లో ముగ్గురు కోవర్టు నేతలు ఉన్నారని ఆరోపించారు.
అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. నార్సింగ్ పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, బాధితురాలి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. మరోవైపు సఖీ, భరోసా బృందాలు కూడా ఆమె నుంచి సమాచారం సేకరించాయి.
భాగ్యనగరం హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలకు సంబంధించిన రూట్ మ్యాప్ విడుదలైంది. పోలీసుల ఆంక్షలను గమనిస్తూ నిమజ్జనాలకు వినాయక ప్రతిమలను తరలించాల్సి ఉంటుంది. ఈ మేరకు 17,18వ తేదీల్లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. గణేష్ నిమజ్జన ఊరేగింపు, ట్రాఫిక్ నిబంధనలు, పార్కింగ్ స్థలాలు, ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల రూట్ ఎంట్రీ, భారీ అతిభారీ వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు.
Breaking News September 14th Today Latest Telugu News Live Updates Siva
ఎమ్మెల్యే గాంధీ నివాసానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెళ్లారు. ఆంధ్ర వాళ్ళ ఓట్లు, డబ్బులు మాత్రమే బీఆర్ఎస్కు కావాలని.. అక్కడి వారితో వ్యాపారాలు కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నేరు హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నిన్న (గురువారం) ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి-అరెకపూడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు, కౌశిక్ రెడ్డి ఇంటి వెలుపల రచ్చ, అనంతరం అరెస్టులు వంటి పరిణామాల నేపథ్యంలో ఇవాళ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీయకుండా ఈ మేరకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య వ్యవహారం మరింత హీటెక్కుతోంది. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.