Allu Arjun Release: ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్.. వచ్చీరాగానే..
ABN , Publish Date - Dec 14 , 2024 | 08:52 AM
Allu Arjun Release: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు. విడుదలైన వెంటనే గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కు వెళ్లిన బన్నీ.. ఆ తర్వాత ఇంటికి బయల్దేరారు.
Allu Arjun Release: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు. విడుదలైన వెంటనే గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కు వెళ్లిన బన్నీ.. ఆ తర్వాత ఇంటికి బయల్దేరారు. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే తన కుమారుడు అల్లు అయాన్‌ను హత్తుకున్నారు. కొడుకును కౌగిలించుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూతురు అర్హతో పాటు భార్య స్నేహారెడ్డి, కుటుంబ సభ్యులను కలసి ఎమోషనల్ అయ్యారు. అనంతరం ప్రెస్ మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చట్టాలను గౌరవిస్తానని అన్నారు.
అండగా ఉంటా
‘సంధ్య థియేటర్ ఘటన బాధాకరం. తొక్కిసలాట ఘటనలో మహిళ చనిపోవడం దురదృష్టకరం. రేవతి కుటుంబానికి నేను అన్ని విధాలా అండగా ఉంటా. 20 ఏళ్లుగా థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూస్తున్నా. ఆ రోజు ఘటన అనుకోకుండా జరిగింది. నేను చట్టాలను గౌరవిస్తా. లీగల్ అంశాలపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేను’ అని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ఆయన థ్యాంక్స్ చెప్పారు.
Also Read:
అల్లు అర్జున్ విడుదల.. కానీ ఇంటికి వెళ్లలేదు
మెగా పవర్ చూపించారు కదా.. ఏకమైనా ఇండస్ట్రీ
ఆ కారణంతోనే రాత్రంతా జైల్లోనే అల్లు అర్జున్
For More Telangana And Telugu News