Allu Arjun Release: అరెస్ట్ నుంచి రిలీజ్ వరకు.. టీ-షర్ట్‌తో అల్లు అర్జున్ స్ట్రాంగ్ మెసేజ్
ABN , Publish Date - Dec 14 , 2024 | 10:28 AM
Allu Arjun Release: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ విడుదలయ్యారు. మధ్యంతర బెయిల్ మీద రిలీజైన బన్నీ ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆయన్ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు ఇంటికి విచ్చేస్తున్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ విడుదలయ్యారు. మధ్యంతర బెయిల్ మీద రిలీజైన బన్నీ ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆయన్ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు ఇంటికి విచ్చేస్తున్నారు. ఇప్పటికే ‘పుష్ప’ మూవీ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్‌తో పాటు డైరెక్టర్ సుకుమార్ బన్నీని కలిశారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండతో పాటు ఇతర ఇండస్ట్రీ ప్రముఖులు ఆయన్ను కలిసేందుకు వస్తున్నారని తెలిసింది. మరోవైపు పుష్పరాజ్ విడుదలతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. అయితే అరెస్ట్ నుంచి రిలీజ్ వరకు ఒక అంశం మాత్రం హైలైట్‌గా నిలిచిందనే చెప్పాలి. అదే బన్నీ టీ-షర్ట్.
టీ-షర్ట్ మార్చుకొని..
సంధ్య థియేటర్ కేసులో శుక్రవారం మధ్యాహ్నం అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో షార్ట్ వేసుకొని కనిపించిన బన్నీ.. ఆ తర్వాత దుస్తులు మార్చుకొని పోలీసుల వెంట చిక్కడపల్లి పీఎస్‌కు బయల్దేరారు. వైట్ కలర్ కార్గో ప్యాంట్, అదే రంగులో ఒక హుడీని వేసుకున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత పోలీసు స్టేషన్‌కు, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి, అటు నుంచి నాంపల్లి కోర్టుకు, ఆ మీదట చంచల్‌గూడ జైలుకు బన్నీని తరలించారు పోలీసులు. శనివారం ఉదయం ఆయన రిలీజై ఇంటికి వెళ్లిపోయారు. ఈ 24 గంటలు పుష్పరాజ్ ఒకే టీ-షర్ట్‌తో కనిపించడంతో అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు.
ఆ లైన్స్‌కు అర్థం ఏంటి?
అరెస్ట్ సమయంలో బన్నీ టీ-షర్ట్ మార్చి అందరికీ స్ట్రాంగ్ మెసేజ్ పంపించారని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. దానిపై రాసి ఉన్న లైన్సే దీనికి ఊతం ఇస్తున్నాయని చెబుతున్నారు. ‘ఫ్లవర్ నహీ.. ఫైర్ హై మే’ అని ఆ టీ-షర్ట్ మీద హిందీలో రాసి ఉంది. ‘పుష్ప’ మూవీలో వచ్చే ఈ డైలాగ్‌కు తెలుగులో ‘ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’ అనేది అర్థం. లైఫ్‌లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా తగ్గేదేలే అంటూ దూసుకెళ్తానని ఈ టీ-షర్ట్‌తో బన్నీ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడని నెటిజన్స్ అంటున్నారు. సమస్యలకు ఎదురొడ్డి నిలిచే ఫైర్ లాంటోడ్ని అని ఆయన చెప్పకనే చెప్పాడని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, బెయిల్ మీద విడుదలై ఇంటికి రాగానే బన్నీ షర్ట్ మార్చారు. ఐకాన్ స్టార్ అని రాసి ఉన్న టీ-షర్ట్‌ను ధరించారు.
Also Read:
మీడియా ముందుకు ‘పుష్ప’.. అరెస్ట్‌పై ఏమన్నారంటే..
అల్లు అర్జున్ విడుదల.. కానీ ఇంటికి వెళ్లలేదు
మెగా పవర్ చూపించారు కదా.. ఏకమైనా ఇండస్ట్రీ
ఆ కారణంతోనే రాత్రంతా జైల్లోనే అల్లు అర్జున్
For More Telangana And Telugu News