Dy CM: డిప్యూటీ సీఎం ఉదయనిధికి అస్వస్థత
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:24 AM
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. గత కొద్దిరోజులుగా ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో బీజీబీజీగా గడుపుతున్నారు. కాగా.. వైద్యుల సూచన మేరకు ఆయన ఇంటివద్దే విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఆయన తండ్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు.

- క్రీడా విధానాన్ని ప్రవేశపెట్టిన స్టాలిన్
చెన్నై: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(State Deputy CM Udhayanidhi) తీవ్ర అస్వస్థతకు గురై ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని శాసనసభలో ముఖ్యమంత్రి స్టాలిన్ తెలియజేశారు. గురువారం ఉదయం శాసనసభలో ఉదయనిధి ప్రవేశపెట్టాల్సిన క్రీడా సంక్షేమం, యువజన సంక్షేమ శాఖలకు సంబంధించి ప్రత్యేక అంశాల ప్రణాళికా విధానాలను స్టాలిన్(Stalin) ప్రవేశపెట్టారు.
ఈ వార్తను కూడా చదవండి: High Court: 21వ తేదీలోగా పార్టీ జెండాలు తొలగించకపోతే కేసులు
ఆ సందర్భంగా ఉదయనిధి సభకు రాకపోవడంపై స్టాలిన్ వివరణ ఇస్తూ బుధవారం స్వల్ప అస్వస్థతోనే సమావేశంలో పాల్గొన్నారని, గురువారం ఉదయం తీవ్ర అస్వస్థతతో ఉండటం వైద్యుల సలహా మేరకు ఇంటిపట్టునే విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు. ఉదయనిధి తరఫున రెండు ప్రణాళికా విధానాలను సభ ముందు ఉంచుతున్నానని స్టాలిన్(Stalin) పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎమ్మెల్యే సత్యంను బెదిరించిన వ్యక్తికి బెయిల్
పాస్టర్ ప్రవీణ్‌కు అంతిమ వీడ్కోలు
మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు
గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దు..
Read Latest Telangana News and National News