Home » Ugadi
ఉగాది అంటే ముఖ్యంగా తెలుగువాళ్లకు కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. చైత్రమాసంలో శుద్ధ పాడ్యమి రోజున ఉగాది జరుపుకుంటాము. ప్రధానంగా తెలుగు, కన్నడ ప్రజలకు అత్యంత పవిత్రమైన పండుగ ఇది. ఉగాది అంటే 'యుగాది' కొత్త యుగం ఆరంభంమనే సంకేతానిస్తుంది.
తెలుగు ప్రజలందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు మంత్రి లోకేశ్. తెలుగువారిలో కొత్త ఆనందాలు తెచ్చే పండుగల్లో ఉగాది ప్రత్యేకమైందని చెప్పారు.
కొత్త చిగుళ్లు తొడిగిన కొమ్మలు.. కోకిలల కుహు..కుహూ రాగాలు.. మామిడి పిందెలు ఉగాది శోభకు ప్రతిరూపాలు. కొత్త బట్టలు, భక్ష్యాల విందులు, షడ్రుచుల ఆరగింపు, పంచాంగ పఠనం, కవితా సమ్మేళనాలు.. ఇవన్నీ కొత్త సంవత్సరాది సందళ్లు. చైత్ర శుద్ధ పాడ్యమి సందర్భంగా ఆదివారం వచ్చే ఈ కొత్త తెలుగు సంవత్సరాది (శ్రీవిశ్వావసు సంవత్సరం)కి ఘనంగా స్వాగతం పలికేందుకు నగరం సిద్ధమైంది.
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్‌లో శనివారమే ఉగాది సాంస్కృతిక వేడుకలు జరిగాయి.
బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసి బయలుదేరుతున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి శనివారం రాత్రి వందకు పైగా అదనపు బస్సులను వేశామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.
Ugadi special food recipes : దేశవ్యాప్తంగా ఉగాది పండగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో జరుపుకుంటారు. తెలుగువారు ఉగాది పచ్చడితో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. కానీ, పురాణాల ప్రకారం ఉగాది నాడు తప్పక తినాల్సిన మరికొన్ని ఆహారపదార్థాలు కూడా ఉన్నాయి.
Ugadi 2025: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఉగాది ఒకటి. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. ఇవొక్కటే కాదు. ఉగాది రోజున తప్పక చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి.
కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ, ఆధ్యాత్మికతను పెంపొందించుకునే పండుగ ఉగాది. ఈ పండుగ రోజు చేసుకునే ఉగాది పచ్చడి షడ్రుచులతో కూడి ఆరోగ్యానికి మేలు చేస్తుందట. షడ్రుచుల కలయిక.. మనలోని భావోద్వేగాలకు ప్రతీక ఈ పచ్చడి. ఉగాది పండగ రోజున ప్రతీ ఒక్కరు ఉగాది పచ్చడిని సేవించడం ఆనవాయితీ. పంచాంగ శ్రవణం ద్వారా గ్రహాల ప్రభావాన్ని అర్థం చేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ సంవత్సరం మార్చి 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఉగాది పండుగ జరగనుంది. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం నుంచి కొన్ని రాశులకు మంచి ఫలితాలు కలుగనున్నాయి. అన్ని రకాలుగా వారికి రాజయోగం పట్టనుంది. విద్య, ఉద్యోగం, వివాహం, బిజినెస్ వంటి విషయాల్లో పట్టిందల్లా బంగారం అవుతుంది.
తెలుగు వారి కొత్త సంవత్సరాది ఉగాది పండుగ నుంచి ప్రారంభం అవుతుంది. ఇక ఉగాది పండుగ నాడు కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తారు. మరీ ముఖ్యంగా తినే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఉగాది పండుగ నాడు కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. అవి ఏవంటే...