Share News

Ugadi 2025: ఉగాది రోజు ఇవి తింటే మహా పాపం.. అవేంటంటే

ABN , Publish Date - Mar 28 , 2025 | 09:20 AM

తెలుగు వారి కొత్త సంవత్సరాది ఉగాది పండుగ నుంచి ప్రారంభం అవుతుంది. ఇక ఉగాది పండుగ నాడు కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తారు. మరీ ముఖ్యంగా తినే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఉగాది పండుగ నాడు కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. అవి ఏవంటే...

Ugadi 2025: ఉగాది రోజు ఇవి తింటే మహా పాపం.. అవేంటంటే
Ugadi

జనవరి 1న కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. కానీ తెలుగు వారికి మాత్రం ఉగాది నుంచి కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది. తెలుగు మాసాల ప్రకారం చైత్ర పాడ్యమి నాడు వచ్చే ఉగాది పండుగ నుంచే నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. మిగతా పండగలతో పోలిస్తే.. ఉగాదికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పర్వదినం నాడు కచ్చితంగ ఉగాది పచ్చడి సేవిస్తారు. షడ్రుచుల మిళితమైన ఈ పచ్చడి.. మన జీవితంలో వచ్చే భావోద్వేగాలకు ప్రతి రూపం. అలానే ఉగాది నాడు కచ్చితంగా పంచాగ శ్రవణం చేస్తారు. ఇక ప్రతి పండుగకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నట్లే ఉగాదికి కూడా ఉన్నాయి. ఈ పండుగ నాడు కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. అవి ఏవంటే..


మాంసాహారం (నాన్-వెజిటేరియన్)

సాధారణంగా పండుగ పూట దీపారాధన చేసి.. పరమాన్నం, శాఖాహారం తీసుకుంటారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం కచ్చితంగా మాంసాహారం తింటారు. అయితే ఉగాది నాడు మాత్రం ఎవ్వరూ మాంసాహారం ముట్టరు. కొత్త ఏడాదిని పరిశుద్ధంగా ప్రారంభించాలనే ఆలోచనతో.. కేవలం శాఖాహార భోజనం చేస్తారు.

మద్యం

ఉగాది అనే కాదు.. ఏ పండుగ నాడైనా సరే.. మద్యం తీసుకోవడం మంచి పద్దతి కాదు. పండుగ పూట మత్తులో కూరుకుపోవడం మహాపరాధం. కనుక ఉగాది నాడు మందు తాగరాదు.


ఉల్లి,వెల్లుల్లి

ఉల్లి, వెల్లుల్లి శాఖాహారం భోజనం కిందకే వచ్చినప్పటికి.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వీటిని తినరు. మరీ ముఖ్యంగా మాలధారణ చేసిన వారు మండలం రోజుల పాటు ఉల్లి, వెల్లుల్లికి దూరంగా ఉంటారు. ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం వీటిని తామసిక ఆహారాలుగా భావిస్తారు. వీటిని తింటే మనస్సును అశాంతికి గురిచేస్తాయని ఆయుర్వేదం చెబుతుంది. అందుకే ఉగాది పండగ నాడు వీటికి దూరంగా ఉంటే మంచిది అంటున్నారు పండితులు.

పులిసిన ఆహారం

దక్షిణ భారతదేశంలో పులిసిన ఆహారం.. భోజనంలో ఒక భాగం. ఇడ్లీ, దోసె పెరుగు వంటివి పులిసిన ఆహారాల కిందకు వస్తాయి. వీటిని తింటే శరీరం స్తబ్దుగా మారుతుంది. అందుకే మిగతా రోజుల్లో ఎలా ఉన్నా పండుగ పూట మాత్రం వీటిని తీసుకోవద్దని అంటున్నారు పండితులు.


ఒంటరిగా చేదు, పులుపు తినకూడదు

ఉగాది అనగాన ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. దీనిలో ప్రధాన పదార్థాలు వేప పువ్వు, చింతపండు రసం. అయితే ఉగాది నాడు కచ్చితంగా పచ్చడి తినాలి. వాటిల్లో చేదు, పులుపు కచ్చితంగా ఉంటుంది. అయితే ఉగాది నాడు చేదు, పుల్లని ఆహారాలను ఒంటరిగా తినకూడదు అంటున్నారు పండితులు.

తింటే ఏం జరుగుతుంది

పైన చెప్పిన ఆహారాలను తింటే తక్షణమే ఎలాంటి సమస్యలు రాకపోవచ్చు కానీ.. దీర్ఘ కాలంలో అవి మీ మీద ప్రభావాన్ని చూపుతాయి అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు, పండితులు. ఎలాంటి ప్రభావం చూపుతాయంటే..


మాంసాహారం, మద్యం తీసుకుంటే

ఉగాది పండుగ నాడు మాంసం, మద్యం తీసుకుంటే.. సంవత్సరం ప్రారంభంలోనే అశుభ శక్తులను ఆహ్వానించినట్లు భావిస్తారు, ఇది దురదృష్టానికి దారితీస్తుందని కొందరు నమ్ముతారు.

ఉల్లి, వెల్లుల్లి..

ఉగాది పండుగ నాడు తామసిక ఆహారాలైన ఉల్లిపాయలు, వెల్లుల్లి తింటే మనస్సు చంచలంగా మారి ఆధ్యాత్మిక చింతన దూరమవుతుంది అంటున్నారు.

పులిసిన ఆహారం..

ఉగాది పండుగ నాడు.. పులిసిన ఆహారం తింటే.. శరీరంలో బద్ధకం పెరిగి, కొత్త సంవత్సరం నాడు బద్దకంగా ఉంటారు.

ఇక ఉగాది పండుగా నాడు కచ్చితంగా ఉగాది పచ్చడి, పులిహోర, పాయసం వంటి సాంప్రదాయ వంటకాలు తినడం ఆచారం. వీటిని తినడం వల్ల శారీరక ఆరోగ్యం కంటే ఆధ్యాత్మిక శుద్ధతతో పాటు సంవత్సరం అంతా సానుకూలంగా ఉంటుందని భావిస్తారు.

గమనిక: పైన తెలిపిన సమాచారాన్ని ABN Andhrajyoty నిర్ధారించడం లేదు. కొందరి విశ్వాసాల ఆధారంగా రాసిన కథనం మాత్రమే. దీనికి, ABN Andhrajyotyకి ఎలాంటి సంబంధం లేదు.

ఇవి కూడా చదవండి:

సినిమాగా డొక్కా సీతమ్మ కథ

శుక్రవారం రోజు ఈ పనులు ఎందుకు చేయకూడదో తెలుసా..

Updated Date - Mar 28 , 2025 | 09:24 AM