Share News

Ugadi 2025 Special:ఉగాది నాడు కచ్చితంగా తినాల్సిన సంప్రదాయ వంటకాలు ఇవే..

ABN , Publish Date - Mar 29 , 2025 | 08:30 PM

Ugadi special food recipes : దేశవ్యాప్తంగా ఉగాది పండగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో జరుపుకుంటారు. తెలుగువారు ఉగాది పచ్చడితో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. కానీ, పురాణాల ప్రకారం ఉగాది నాడు తప్పక తినాల్సిన మరికొన్ని ఆహారపదార్థాలు కూడా ఉన్నాయి.

Ugadi 2025 Special:ఉగాది నాడు కచ్చితంగా తినాల్సిన సంప్రదాయ వంటకాలు ఇవే..
Telugu Ugadi food recipes

Ugadi special food recipes : ఈ సారి మార్చి 30వ తేదీ ఆదివారం రోజున ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు వారి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఉగాదితో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మొదలుకానుంది. ఈ రోజున తీపి, పులుపు, వగరు, చేదు, కారం, ఉప్పు కలగలసిన షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిని తినడాన్ని పవిత్రంగా భావిస్తారు. ఈ సాంప్రదాయ వంటకం జీవితంలో ఎదురయ్యే సుఖ దుఃఖాలు, సవాళ్లను సమానంగా స్వీకరించాలని మనకు బోధిస్తుంది. దేవుడికి ఈ పచ్చడిని నైవేద్యంగా సమర్పించిన తర్వాత అందరూ మొదటగా రుచి చూసే ఆహారం ఇదే. దీంతో పాటుగా ఉగాది నాడు ఈ కింది సాంప్రదాయ వంటకాలు కూడా తప్పక చేసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి.


ఉగాది పండగ రోజున తప్పక చేయాల్సిన కొన్ని వంటకాలు

  • ఉగాది పచ్చడి :

    వేప పువ్వులు, సన్నగా తరిగిన పచ్చి మామిడికాయ, తరిగిన బెల్లం, చింతపండు, మిరియాల పొడి, ఉప్పును నీటిలో కలిపి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు.

  • బెల్లం పొంగలి : బియ్యం, పెసరపప్పు, పాలు, బెల్లం, నెయ్యి, ఎండుద్రాక్ష, జీడిపప్పు, ఏలకుల పొడితో తయారుచేసే రుచికరమైన సాంప్రదాయ వంటకం. ఆవుపాలు, నెయ్యితో తయారుచేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే మరీ మంచిది. కావలిస్తే బెల్లం బదులుగా చక్కెర వేసుకోవచ్చు.


  • రవ్వ కేసరి : కేసరి రవ్వ, నెయ్యి, నట్స్, చక్కెరతో తయారుచేసిన ఈ పదార్థం సూపర్ క్విక్ రెసిపి. రవ్వ కేసరిని పాల కేసరి , పండ్ల కేసరి , పైనాపిల్ కేసరి, మామిడి కేసరి వంటి అనేక రుచులలో కూడా తయారు చేయవచ్చు.

  • బెల్లం పానకం: బెల్లం, యాలకుల పొడి, నీటిలో కలిపి చేసే పానీయం. ఉగాది, శ్రీరామ నవమి పండగల సమయాల్లో ఈ పానీయాన్ని దేవతలకు సమర్పించడం ఆనవాయితీ.

  • చలిమిడి : చలిమిడి, వడ పప్పు బియ్యం పిండి నానబెట్టిన పెసలు కలిపి తయారుచేసిన వంటకం. దీనిని పానకంతో కలిపి తింటే చాలా మంచిది.


  • పులిహోర : చింతపండుతో తయారుచేసే సాంప్రదాయ పులిహోర పండుగల సమయంలో తప్పకుండా నైవేద్యంలో పెడతారు.

  • పూర్ణం బూరెలు : పూర్ణం బూరెలు అంటే తీపిగా స్టఫ్డ్ చేసిన పిండిలో వేయించిన పదార్థాలు. ఈ స్టఫింగ్ శనగపప్పు, బెల్లంతో తయారు చేస్తారు.బియ్యంపిండి లోపల ఈ స్టఫ్ ఉంచి బురెలు తయారుచేస్తారు.


Read Also: Ugadi 2025 :ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి.. ఆ రోజున తప్పక చేయాల్సిన పనులేంటి..

Zodiac Signs: మీరు ఈ రాశిలో పుట్టారా మీకు బ్యాడ్ టైమ్ స్టార్ కాబోతుందని తెలుసా

Ugadi Special: ఉగాది పచ్చడి వెనుక రహస్యం తెలిస్తే తినకుండా వదిలిపెట్టరు

Updated Date - Mar 29 , 2025 | 08:43 PM