Ugadi 2025 Wishes: కొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం
ABN , Publish Date - Mar 30 , 2025 | 08:50 AM
ఉగాది అంటే ముఖ్యంగా తెలుగువాళ్లకు కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. చైత్రమాసంలో శుద్ధ పాడ్యమి రోజున ఉగాది జరుపుకుంటాము. ప్రధానంగా తెలుగు, కన్నడ ప్రజలకు అత్యంత పవిత్రమైన పండుగ ఇది. ఉగాది అంటే 'యుగాది' కొత్త యుగం ఆరంభంమనే సంకేతానిస్తుంది.

ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్ వీక్షకులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. మా వెబ్‌సైట్‌ను ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదములు. కొత్త సంవత్సరంలో మీ అందరి ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నాము. మీరు తలపెట్టిన ప్రతి పని విజయవంతమవ్వాలని ఆకాంక్షిస్తున్నాము.
ఉగాది అంటే ముఖ్యంగా తెలుగువాళ్లకు కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. చైత్రమాసంలో శుద్ధ పాడ్యమి రోజున ఉగాది జరుపుకుంటాము. ప్రధానంగా తెలుగు, కన్నడ ప్రజలకు అత్యంత పవిత్రమైన పండుగ ఇది. ఉగాది అంటే 'యుగాది' కొత్త యుగం ఆరంభంమనే సంకేతానిస్తుంది. ఈ రోజున ప్రజలు ఇంటిని అలంకరించి మామిడి ఆకులతో తోరణాలు కడతారు, ఉగాది పచ్చడి తయారు చేసి ఆరు రుచులను (తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు, వగరు) సమన్వయం చేస్తారు. ఇది జీవితంలోని వివిధ అనుభవాలను స్వీకరించడానికి సంకేతం. పంచాంగ శ్రవణం, దేవాలయ దర్శనం, కొత్త పనులు ప్రారంభించడం ఈ రోజు విశిష్టతలు.
విశిష్టత
ఉగాది పండుగను జరుపుకోవడం వెనుక చారిత్రక, సాంస్కృతిక కారణాలు ఎన్నో ఉన్నాయి. శ్రీ కృష్ణుడు కలియుగం ప్రారంభించిన రోజుగా, బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించిన రోజుగా దీనిని జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. విశ్వావసు అంటే 'విశ్వసనీయమైన సంవత్సరం'. ఈ సంవత్సరం శాంతి, సమృద్ధి, సౌభాగ్యాన్ని తెస్తుందని నమ్ముతారు. గురు, శని గ్రహాల స్థానాలు అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారవేత్తలు, రైతులు, ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో సానుకూల మార్పులు, సాంస్కృతిక కార్యక్రమాలు పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఉగాది విశిష్టతకు సంబంధించి మరిన్ని కథనాల కోసం కింది వాటిని చదవండి
Ugadi Special: ఉగాది పచ్చడి వెనుక రహస్యం తెలిస్తే తినకుండా వదిలిపెట్టరు
Ugadi 2025 Special:ఉగాది నాడు కచ్చితంగా తినాల్సిన సంప్రదాయ వంటకాలు ఇవే..