Home » Uttar Pradesh
కోట్లాది మందితో ఇంతపెద్ద ఈవెంట్ నిర్వహించడం ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వ సామర్థ్యాన్ని, అటు దేశం సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పగలిగామని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తప్పుడు సమాచారం ప్రచారం చేసేందుకు జరిగిన ప్రయత్నాలను దేశ ప్రజల విశ్వాసం వమ్ము చేసిందని చెప్పారు.
పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆకాశ్ ఆనంద్‌ను బీఎస్పీ నుంచి బహిష్కరించినట్టు మాయావతి ప్రకటించారు.ఆకాశ్ ఆనంద్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తాడని భావించినా అతను రాజకీయ అపరిపక్వత చూపించారని అన్నారు.
మాయావతి రాజకీయ వారుసుడిగా, బీఎస్పీ జాతీయ కో-ఆర్డినేటర్‌గా ఆకాష్ ఆనంద్ ఇంతవరకూ వ్యవహరిస్తున్నారు. లక్నోలో ఆదివారంనాడు బీఎస్పీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు.
కుంభమేళా ముగిసింది.. గంగ, యమున, సరస్వతీ నదుల సంగమ ప్రదేశం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చివరిరోజైన...
మహా శివరాత్రి పండుగ రోజు (ఫిబ్రవరి 26న) చివరి అమృత స్నానంతో మహా కుంభమేళా 2025 ముగియనుంది. ఈ నేపథ్యంలో చివరి రోజైన నేడు స్నానమాచరిస్తున్న భక్తులపై హెలికాప్టర్లతో 20 క్వింటాళ్ల గులాబీ పూల వర్షం కురిపించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
Maha Kumbh Mela 2025 : ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా ఈ రోజుతో ముగిసిపోతుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రారంభమైన రోజు నుంచే ఆశ్చర్యకరమైన వ్యక్తులు, వింతలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా త్రివేణి సంగమంలో 37 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఇద్దరు మిత్రుల కథ అందరి మనసులను కదిలిస్తోంది..
2025 మహా కుంభమేళా ఈరోజు చివరి దశకు వచ్చేసింది. నేడు మహాశివరాత్రి అయిన నేపథ్యంలో శివుడికి ప్రత్యేక పూజలు చేసేందుకు కాశీ విశ్వనాథ ఆలయం వైపు నాగ సాధువులు భారీగా తరలి వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియో ఆకట్టుకుంటోంది. అయితే తర్వాత కుంభమేళా ఎక్కడ జరుగుతుందనే విషయాలను కూడా ఇప్పుడు చూద్దాం.
మహా కుంభమేళా చివరిదశకు వచ్చిన నేపథ్యంలో భక్తుల తాకిడి మరింత పెరిగింది. దీనికి తోడు మహాశివరాత్రి పండుగ వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ మేళాకు ఎంతమంది వచ్చి పుణ్య స్నానాలు చేశారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో సనాతన ధర్మం పాటించే 110 కోట్ల మందిలో సగం మందికి పైగా (55) ఇప్పటి వరకూ త్రివేణి సంగమ స్నానాలు చేశారని యూపీ ప్రభుత్వం ప్రకటించటింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఈనెల 26న మహా శివరాత్రి వరకూ కొనసాగనుంది.
మహాకుంభమేళాకు సంబంధించి తప్పుదారి పట్టించే కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్న 140 సోషల్ మీడియా అకౌంట్లపై ఎఫ్ఐఆర్లు దాఖలు చేసినట్టు యూపీ పోలీసులు పేర్కొన్నారు.