Home » Varla Ramaiah
ఏపీలో వైసీపీ (YSRCP) నేతలు ప్రజలను, ప్రతిపక్షాలను భ్రయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. పుంగనూరు నియోజకవర్గం ఏపీలో లేదా అక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక సామ్రాజ్యం నడుపుతున్నారా అని ప్రశ్నించారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazir)ను తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు శనివారం కలిశారు. వచ్చే మే నెల పింఛన్ల (pensions) పంపిణీ ఇంటి వద్దే 1,2 వ తేదీల్లో ఇచ్చేలా చూడాలని గవర్నర్‌ను ఎన్డీఏ నేతలు కోరారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు.
గొడ్డలి వేటు సూత్రధారి(ఎంపీ అవినాష్‌రెడ్డి)ని అమాయకుడంటే రాష్ట్ర ప్రజలను కించపరచడమే, కడప ప్రజలను వంచించడమేనని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) సంచలన ఆరోపణలు చేశారు.
వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు ఎన్నికల సంఘాని (Election Commission) కి ఫిర్యాదు చేశారు. మంగళవారం నాడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిశారు.
Andhrapradesh: ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేందుకు పోలీసులను వైసీపీ ప్రభుత్వం వాడుకుంటుందోని ఎన్నికల కమిషన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈసీకి వర్ల లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అధికార వైసీపీ చేతిలో పోలీసు యంత్రాంగం పనిచేస్తోందన్నారు. ప్రత్యర్ధులను వేధించడానికి పోలీసులను వైసీపీ అభ్యర్థులు అస్త్రంగా చేసుకున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో పలువురు పోలీసుల వ్యవహార శైలిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో ఎంకే మీనాను శుక్రవారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం అందుకు సంబంధించిన వివరాలను టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య వివరించారు.
Andhrapradesh: పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు తగిన ఏర్పాట్లు చేయడం లేదంటూ ఎస్ఈసీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఎన్నికల డ్యూటీలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఫామ్‌లు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల వినియోగంపై నేటికి ఎటువంటి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయలేదన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేసి ఫామ్-12 ఇవ్వాలని..
మరోసారి అధికారంలోకి రావడానికి సీఎం జగన్ (CM Jagan) గులకరాయి డ్రామా ఆడారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. ఆయన చేసిన నాటకమే ఈ బూటకపు హత్యా ప్రయత్నమని.. ‘‘జగన్నాటకం’’.. ఇదో పెద్ద డ్రామా అని ఆరోపించారు. గతంలో కోడికత్తి, మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్యను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారు.. అదే కుట్రతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని హత్యాయత్నం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికల సంఘం పలుమార్లు చెప్పినా కొంతమంది ప్రభుత్వాధికారులు పట్టించుకోవట్లేదని తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య (Varla Ramaiah) అన్నారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాను తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం నాడు కలిసి పలు ఫిర్యాదులు అందజేశారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గులకరాయి కథ అడ్డం తిరిగిందని.. వైసీపీ క్రియేట్ చేసిన డ్రామా వారికే ఎదురుతిరిగిందంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ ఆడే డ్రామా పూర్తవకముందే ఎదురుతిరిగి నటులు అభాసుపాలయ్యారన్నారు. ఒకేరాయి ఇద్దరికి తగిలినా కింద పడకుండా ఎటో పోవడం ఆశ్చర్యకరమని సెటైర్ విసిరారు.