Home » Varla Ramaiah
జిమ్మిక్కులు, మాయలు, మోసాలు చేసైనా, ప్రజలను భ్రమలో పెట్టైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని సీఎం జగన్ (CM Jagan) తాపత్రయపడుతున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varlaramaiah) అన్నారు. ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు జగన్‌ని గద్దె దించుతున్నారని ఆయనకు తెలుస్తోందని... అందుకే ఇలాంటి డ్రామాలు మొదలు పెట్టారని అన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ( Nara Lokesh ) ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్టీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా మహేశ్వరరావు స్పందించారు. ఒంగోలులో టీడీపీ నేతలపై దాడి అంశాలపై అదనపు సీఈఓ కు ఫిర్యాదు చేశారు.
కొంతమంది పోలీసు అధికారులు జగన్‌కు తొత్తులుగా పనిచేయడం వల్ల కిందిస్థాయి పోలీసు సిబ్బంది ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) ఆరోపించారు.
Andhrapradesh: ఏపీలో పోలీసుల ఆత్మహత్యలపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కోసం పనిచేసి పోలీస్ శాఖ చెడ్డ పేరు మూటకట్టకుందని.. జగన్ పాలనలో పోలీసు ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. పోలీసుల ఆత్మహత్యకు జగనే కారణమని ఆరోపించారు. ముఖ్యమంత్రి, డీజీపీ చేతగాని తనంతోనే పోలీసులకు ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. పోలీసు ఉద్యోగులకు రావాల్సిన సరెండర్స్ లీవ్స్ ఇవ్వడంలేదని.. టీఏ, డీఏలు ఇవ్వడంలేదని మండిపడ్డారు.
Andhrapradesh: తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయ కాంపౌండ్‌లో హెరిటెజ్‌కు సంబంధింన కీలక డాక్యుమెంట్ల దగ్ధంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో టీడీపీ నేతలు మాట్లాడుతూ... ఎవరి ఆదేశాలతో డాక్యుమెంట్లు తగలబెట్టారనేది వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్ (CM Jagan), సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం సీనియర్ నేతలు వర్లరామయ్య దేవినేని ఉమామహేశ్వరరావు చేశారు. ఈ సందర్భంగా వర్లరామయ్య (Varlaramaiah) మాట్లాడుతూ... జగన్ ఇష్టం వచ్చినట్లు నోటకి వచ్చినట్లు టీడీపీ అధినేత చంద్రబాబుపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు జగన్ అతీతుడా అని అడిగామన్నారు. జగన్ నటుడుగా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి అని ఎద్దేవా చేశారు.
వైసీపీ (YSRCP) నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని (నిన్న)బుధవారం నాడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య (Varla Ramaiah) ఫిర్యాదు చేశారు. వర్ల రామయ్య ఫిర్యాదుపై స్పందించి వైసీపీ నేత జోగి రమేష్ (Jogi Ramesh)కు ఎస్ఈసీ మీనా నోటీసులు జారీ చేశారు.
సీఎం జగన్, వైసీపీ నేత పేర్ని నాని, కర్నూలు ఎస్పీపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ఫిర్యాదు చేశారు. బుధవారం నాడు ఈ మేరకు ఓ లేఖ రాశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను విరుద్ధంగా ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని స్కూల్ పిల్లలతో జగన్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి: ఎన్నికల కమిషన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య బుధవారం లేఖ రాశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను ప్రభుత్వం పాటించకుండా పెన్షన్ దారులను సచివాలయంకు వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పడం దుర్మార్గమైన రాజకీయ కుట్ర అని అన్నారు.
Andhrapradesh: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో జాప్యంపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పెన్షన్ల పంపిణీకి దాదాపు పది రోజుల సమయం పడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న టీడీపీ.. ఈ అంశాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లింది. సోమవారం సీఎస్ జవహర్ రెడ్డితో టీడీపీ నేతల బృందం భేటీ అయ్యింది. పెన్షన్లు పంపిణీ విషయంలో వైసీపీ కావాలనే జాప్యం చేసేలా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపించింది.