Home » Vemulawada
దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న రాజన్న సిరిస్లిల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి.
మరో వందేళ్లు చెక్కుచెదరకుండా ఉండేలా వేములవాడ రాజరాజేశ్వర దేవాలయాన్ని అభివృద్ధి చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారుల్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.
తామిచ్చిన డబ్బును ఓ వ్యక్తి తిరిగివ్వడం లేదనే కోపంతో అతడి తల్లిని ఓ కాంట్రాక్టర్ అపహరించాడు. అతని ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిని బలవంతంగా తన కారులో ఎక్కించాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో జరుగుతున్న సద్దుల బతుకమ్మ సంబరాలు నేటితో ముగిశాయి. అందులోభాగంగా మంగళవారం సద్దుల బతుకమ్మను నిమ్మజ్జనం చేశారు. అందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే అంతకుముందు మున్సిపల్ కార్యాలయం నుంచి గౌరీ మాత అమ్మవారిని బతుకమ్మ ఘాట్ వరకు మున్సిపల్ పాలకవర్గం ఊరేగింపుగా తీసుకు వెళ్లింది.
ఎన్నో ఏళ్లుగా సిరిసిల్ల నేతన్నలు ఎదురు చూస్తున్న యారన్ డిపోకు ఎట్టకేలకు మోక్షం లభించింది.
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని అధికారులు, అర్చకుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
తిరుమల తరహాలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో సైతం నిత్యాన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ. ఇక్కడ శివుడు.. రాజరాజేశ్వరుడిగా భక్తులకు దర్శనం ఇస్తారు. సోమవారంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శ్రావణ మాసం, కార్తీక మాసం, శివరాత్రి సమయంలో ఇసుకవేస్తే రాలనంత జనం ఉంటారు. ఆ పరమశివుడిని దర్శించుకొని తరిస్తుంటారు. ఏటేటా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఆ క్రమంలో వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (YTADA) కీలక నిర్ణయం తీసుకుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్లో చేర్చుకున్నామంటూ ఆ పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(MLA Adi Srinivas) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఎమ్మెల్యేని బెదిరించి పార్టీలో చేర్చుకున్నామో ఆధారాలతో సహా నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు.
దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో త్వరలోనే బ్రేక్ దర్శనం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు దేవాదాయ శాఖకు వేములవాడ దేవస్థానం అధికారులు ప్రతిపాదనలు పంపించారు.