Share News

Vemulawada Temple: వేములవాడ రాజన్న భక్తులకు బ్రేక్‌ దర్శనం!

ABN , Publish Date - Jul 07 , 2024 | 05:11 AM

దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో త్వరలోనే బ్రేక్‌ దర్శనం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు దేవాదాయ శాఖకు వేములవాడ దేవస్థానం అధికారులు ప్రతిపాదనలు పంపించారు.

Vemulawada Temple: వేములవాడ రాజన్న భక్తులకు బ్రేక్‌ దర్శనం!

  • వచ్చే నెలలోనే ప్రారంభం.. టికెట్‌ ధర రూ.300

సిరిసిల్ల, జూలై 6 (ఆంధ్రజ్యోతి): దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో త్వరలోనే బ్రేక్‌ దర్శనం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు దేవాదాయ శాఖకు వేములవాడ దేవస్థానం అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఇందుకు సంబంధించిన అనుమతులు త్వరలోనే రానుండగా.. శ్రావణ మాసం మొదటి వారంలోనే బ్రేక్‌ దర్శనాలను ప్రారంభించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే యాదాద్రి ఆలయంలో బ్రేక్‌ దర్శనాలను పరిశీలించి వచ్చిన అధికారులు.. వేములవాడలో ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. బ్రేక్‌ దర్శనం టికెట్‌ ధరను రూ.300గా నిర్ణయించారు.


పదేళ్ల లోపు చిన్నారులకు టికెట్‌ అవసరం లేదు. ప్రతి రోజూ ఉదయం 10.15 నుంచి 11.15 గంటల వరకు ఒకసారి, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు మరోసారి బ్రేక్‌ దర్శనం కల్పించనున్నారు. ఈ టికెట్‌ తీసుకున్న భక్తులకు వంద గ్రాముల లడ్డూను ఉచితంగా అందించనున్నారు. బ్రేక్‌ దర్శనం టికెట్లను ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. బ్రేక్‌దర్శనాన్ని తెస్తున్నప్పటికీ సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Jul 07 , 2024 | 05:11 AM