Home » Virat Kohli
ఐపీఎల్ 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో పోరుకు సిద్దమైంది. చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఓడిన ఆ జట్టు సోమవారం పంజాబ్ కింగ్స్‌తో సొంత మైదానంలో జరిగే మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలగా ఉంది.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసేటపుడు ఎంత సీరియస్‌గా ఉంటాడో, మిగిలిన సమయాల్లో అంత సరదాగా ఉంటాడు. మైదానంలో ఎప్పుడూ లైవ్లీగా ఉంటాడు.
కొద్ది కాలంగా క్రికెట్‌కు దూరమై విశ్రాంతి తీసుకున్న స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్-2024 తొలి మ్యాచ్‌లోనే సంచలన రికార్డు నమోదు చేశాడు.
టైటిల్ గెలవాలనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 16 ఏళ్ల నిరీక్షణకు వారి ఉమెన్స్ టీం తెరదించింది. స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ జట్టు ఇటీవల జరిగిన డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచింది.
చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అన్‌బాక్స్ ఈవెంట్లో ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనను కింగ్ అని పిలవొద్దని కోరాడు. అలా పిలవడం తనకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పాడు.
డబ్ల్యూపీఎల్ 2024 విజేతగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టును వారి పురుషుల జట్టు గార్డ్ ఆఫ్ హానర్‌తో గౌరవించింది.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న IPL 2024 సీజన్‌కు ముందు విరాట్ కోహ్లీ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది. వైరల్ అయిన ఫోటోల్లో కొత్త హెయిర్ స్టైల్‌తో కోహ్లీ ఆకట్టుకుంటున్నాడు.
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024కు సమయం ఆసయన్నమైంది. మార్చి 22 నుంచే ఈ మెగా లీగ్ ప్రారంభంకానుంది. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024కు అంతా సిద్ధమైంది. ఈ శుక్రవారం నుంచే మెగా లీగ్ ప్రారంభంకాబోతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అన్ని ఫ్రాంచైజీలు టోర్నీ కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జట్లన్నీ ప్రాక్టీస్ సెషన్లు ప్రారంభించాయి.
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024) మొదటి లీగ్ టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు నిన్న కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ గెల్చిన వెంటనే మాజీ ఆర్సీబీ జట్టు కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్మృతి మంధానకు వీడియో కాల్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.