Home » YSRCP
ప్రపంచ ఆర్థిక నేరగాడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పరువెక్కడ ఉందని ఏపీ ఆక్వా కల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకట రమణా రెడ్డి ప్రశ్నించారు. ఆయన పరువు నష్టం దావా వేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని ఆనం వెంకట రమణా రెడ్డి విమర్శించారు.
YS Jagan: టీడీపీ సర్కారుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. డిస్కంలను నిలబెట్టడంలో విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు.
వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్రారెడ్డిపై మరో కేసు నమోదైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై వర్రా అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, వాటిని తొలగించమని అడిగితే కులం పేరుతో దూషించారని, అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే చంపుతామని బెదిరించారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.
వైసీపీ ప్రభుత్వం చేసిన అస్తవ్యస్త విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పడిపోతుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 99 శాతం ఉద్యోగుల జీతాలు పెన్షన్లకే సరిపోతుందని అన్నారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ఏడు శాతం ఎక్కువగా ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు.
బీజేపీ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. ప్రజల హక్కులను కాలరాస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం రచించడంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలో కాంగ్రెస్ పాత్ర ఉందని వైఎస్ షర్మిల తెలిపారు.
మైనర్ బాలికపై అటమ్ట్ రేప్ జరిగిందని దుష్ర్పచారం చేయడంతో.. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ బాలిక తండ్రి చెవిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతోపాటు బాలిక భవిష్యత్‌ను దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
కొండేపి నుంచి ఒంగోలుకు వచ్చి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎందుకు పోటీ చేశారని వైసీపీ సీనియర్ నేత చెవి రెడ్డి భాస్కర్ రెడ్ ప్రశ్నించారు. స్వప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హనానికి ఇలా మాట్లాడటం బాలినేనికి తగదని చెవిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
వలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడి ప్రమేయం ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన ఆరోపణలు చేశారు. హత్య జరిగిన తర్వాత బాధితుడు ఇంటికి విశ్వరూప్ వెళ్లారని ఆరోపించారు. కేసు పెట్టకుండా ఉండేందుకు 2 ఎకరాలు ఇస్తానని చెప్పారని ఆరోపణలు చేశారు.
దిగ్గజ వ్యాపారవేత్తగా అదానీ మన దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంధ్ర రాష్ట్ర ప్రజల పరువును తీశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో గౌతమ్ అదానీ నుంచి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇది కలియుగం... కర్మ ఫలం ఎవరినీ వదలదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఈ జన్మలో చేసిన పాపాలకు కర్మ ఫలం ఈ రోజుల్లోనే అనుభవించే రోజులు వచ్చాయని హెచ్చరించారు.