Nara Lokesh: పవనన్న కన్నా, జగన్‌కి ఎక్కువ సెక్యూరిటీ అధ్యక్షా
ABN, Publish Date - Mar 05 , 2025 | 11:44 AM
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనసభలో పలు అంశాలపై మంత్రి నారా లోకేష్ ప్రస్తావించారు. ప్రధానంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా గురించి వైసీపీ నేతలు ప్రస్తావించడంతో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనసభలో పలు అంశాలపై మంత్రి నారా లోకేష్ ప్రస్తావించారు. ప్రధానంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా గురించి వైసీపీ నేతలు ప్రస్తావించడంతో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. గతంలో జన్మోహన్‌రెడ్డి ఎలా వ్యవహారించారనే అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా దక్కనీయకుండా జగన్ ప్రయత్నించారని మండిపడ్డారు. 2019 జూన్ 13వ తేదీన చంద్రబాబును ఉద్దేశించి జగన్ మాట్లాడిన వీడియోను సభ దృష్టికి నారా లోకేష్ తీసుకువచ్చారు.
చంద్రబాబుకు 23 మంది శాసన సభ్యులు ఉన్నారని.. వారిలో ఒక ఐదుగురిని లాగేస్తే 18 లేదా 17 మంది మాత్రమే ఉంటారని జగన్ చెప్పారని గుర్తుచేశారు. అప్పుడు చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని జగన్ చెప్పలేదా అని లోకేష్ ప్రశ్నించారు. అనంతరం జగన్ సెక్యూరిటీ గురించి సభలో మాట్లాడారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నా కంటే, జగన్‌కు ఎక్కువ సెక్యూరిటీ కల్పిస్తున్నామని నారా లోకేష్ స్పష్టం చేశారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Mar 05 , 2025 | 11:52 AM