ఎమ్మెల్సీ ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రచారం వేగం పుంజుకుంది. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం ఊపందుకుంది. ఇటీవల ఇక్కడికి వచ్చే వివిధ ప్రాంతాల నేతల సంఖ్య కూడా పెరుగుతోంది.
వివిధశాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించాలని అదనపు కలెక్టర్ మోతిలాల్ సూచించారు.
జాతీయ ఆరోగ్య మిషన్ సభ్యులు
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిని పరిశీలించారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వ ర్యంలో కొనసాగుతున్న తపాలా (పోస్టల్) శాఖ లో తెస్తున్న సంస్కరణలు, పెండింగ్ సమస్యలు పరిష్కారం కాక భవిష్యత్తుపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
బాల్య వివాహాలను చేయడం చట్ట రీత్యా నేరమని అందుకు రెండు సంవత్సరాల శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించడం జరుగుతుందని జిల్లా బాలల సంవరక్షణ అధికారి మహేష్ అన్నారు.
ప్రభు త్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దృష్టి లోప నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహిస్తోందని జిల్లా వైద్యాధికారి సీతారాం తెలిపారు.
రేషన్‌బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ డేవిడ్ హెచ్చరించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మించతలపెట్టిన హిందూ శ్మశాన వాటిక పనులు వేగం పుంజుకున్నాయి. గోదావరి సమీపంలోని భూధాన్ యజ్ఞ బోర్డు భూముల్లో నాలుగెకరాల విస్తీర్ణంలో 14వ ఆర్థిక సంఘం నిధులు నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టగా, గత అక్టోబరు 3న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు శంకుస్థాపన చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలకు గుర్తుచేయాలని మంచిర్యా ల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.