BRS Party: కేసీఆర్ ఒకటి తలిస్తే.. తెలంగాణ ప్రజలు మరొకటి తలిచారు. హ్యాట్రిక్ కొట్టాలన్న కేసీఆర్ ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తొలిసారిగా ఓటమి పాలైంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచిన గులాబీ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం తన ఓటమిని తానే కొని తెచ్చుకుంది.
వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆది నుంచి కూడా రేవంత్ ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యం కనబరిచారు. మొత్తానికి 32,800 ఓట్ల మెజారిటీతో రేవంత్ ఘన విజయం సాధించారు. అసలు కౌంటింగ్ ప్రారంభం నుంచే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో దూసుకుపోతోంది.
Telangana Results: కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంత్ రావు మల్కాజ్‌గిరి కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం చూపిందని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తుంది. బీఆర్ఎస్ కు షాకిస్తూ.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది.
Telangana Result: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మంత్రి, వనపర్తి బీఆర్‌ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగిస్తోంది.
Telangana Results: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గాంధీభవన్‌కు బయలుదేరారు. జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి భారీ ర్యాలీగా గాంధీభవన్‌కు రేవంత్ వెళ్లారు. అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా గాంధీభవన్‌కు చేరుకున్నారు. తెలంగాణలో అధికారం చేపట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది.
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీది విజయమనే విషయం దాదాపు స్పష్టంగా తేలినట్టే. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని డీజీపీ అంజనీ కుమార్ కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. డీజీపీ వెంట సీఐడీ చీఫ్ మహేష్ భగవత్, సంజయ్ కుమార్ ఉన్నారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ దూసుకుపోతోంది. హస్తం దెబ్బతో అనూహ్యంగా బీఆర్ఎస్ కుదేలయిపోయింది.
Telangana Results: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆరు రౌండ్లు ముగిశాయి.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్రమంగా వెలువడుతున్నాయి.