Toilet Funny Video: వార్నీ.. టెక్నాలజీని ఇక్కడ కూడా వాడాలా.. ఈ బాత్రూంలో షవర్ చూస్తే..
ABN , Publish Date - Apr 04 , 2025 | 11:59 AM
కొందరు అతివిగా ఆలోచించి వినూత్న ప్రయోగాలు చేస్తుంటే.. మరికొందరు అతి తెలివిగా ఆలోచిస్తూ విచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి తన బాత్రూంలో ఇలాంటి విచిత్ర ప్రయోగమే చేశాడు. ఇతడి చేసిన ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు..

వాడుకున్నవాడికి వాడుకున్నంత.. అన్న చందంగా కొందరు టెక్నాలజీని వివిధ రకాలుగా వాడేస్తుంటారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీతో కొందరు అద్భుతాలు చేస్తుంటే.. మరికొందరు విచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. ఇంకొందరు చేసే ప్రయోగాలు అంతా నవ్వుకునేలా ఉంటాయి. ఇలాంటి ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బాత్రూంలో చేసిన ఏర్పాట్లు చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వార్నీ.. టెక్నాలజీని ఇక్కడ కూడా వాడాలా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు అతివిగా ఆలోచించి వినూత్న ప్రయోగాలు చేస్తుంటే.. మరికొందరు అతి తెలివిగా ఆలోచిస్తూ విచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి తన బాత్రూంలో ఇలాంటి విచిత్ర ప్రయోగమే చేశాడు. ప్రస్తుతం బాత్రూంలు నిర్మించే వారు వెస్ట్రన్ కమోడ్, షవర్ అంటి సౌకర్యాలు ఉండేలా చూసుకుంటున్నారు.
Python VS Crocodile: కొండచిలువ పవర్ ఎప్పుడైనా చూశారా.. అంత పెద్ద మొసలిని సైతం..
ఇతను కూడా తన బాత్రూంలో అలాంటి ఏర్పాట్లే చేశాడు. అయితే ఇందులోనూ కాస్త వినూత్నంగా ఆలోచించాడన్నమాట. ఇండియన్ టాయిలెట్ ఫ్లష్ కమోడ్‌ను కింద ఏర్పాటు చేయకుండా (Indian toilet commode on bathroom ceiling) సీలింగ్‌పై ఫిట్ చేశాడు. తర్వాత దానికి వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చాడు. ట్యాప్ ఆన్ చేయగానే సీలింగ్‌పై ఉన్న కమోడ్ నుంచి నీళ్లు తెంపర్లుగా పడేలా సెట్ చేశాడు. ఇలా తన బాత్రూంలో షవర్‌ను (Shower) విచిత్రంగా సెట్ చేసి, అంతా అవాక్కయ్యేలా చేస్తున్నాడు.
Snake Viral Video: పరాయి సొమ్ముపై ఆశపడితే ఇలాగే అవుతుంది.. పనసకాయ చెట్టుపై పాము చేసిన పని చూస్తే..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘కమోడ్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 వేలకు పైగా లైక్‌లు, 4.44 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..