Home » Telangana » Assembly Elections
తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్ సెంటిమెంట్‌కు బ్రేక్ పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా స్పీకర్‌గా పని చేసిన వారు ఇప్పటి వరకూ గెలిచిన పాపాన పోలేదు. తొలిసారిగా ఆ చరిత్రను తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తిరగరాయబోతున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి దూసుకుపోతున్నారు.
Telangana Results: తెలంగాణ ఎన్నికల్లో గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యతను కనపబరుస్తున్నారు. ఇప్పటి వరకు 71 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. అధికార బీఆర్‌ఎస్ పార్టీ కేవలం 34 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
స్వతంత్ర అభ్యర్థిగా.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన బర్రెలక్క వెనుకంజలో కొనసాగుతోంది.
Telangana Results: జిల్లాలోని రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్‌ను అధిక మెజార్టీతో ముందుకు దూసుకెళ్తున్నారు.
Telangana Results: తెలంగాణలో తొలి ఫలితం వెల్లడైంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో మొదటి విజయం కాంగ్రెస్ ఖాతాలో పడింది. ఫలితాలు మొదలైనప్పటి నుంచి మెజార్టీ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్న హస్తం పార్టీ తొలి విజయాన్ని సొంతం చేసుకుంది.
Telangana Results: తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంటే.. హైదరాబాద్‌లో మాత్రం అధికార పార్టీ బీఆర్‌ఎస్ ముందంజలో ఉంది. ఇప్పటికే మూడు రౌండ్లు పూర్తవగా నగరంలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు తమ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రౌండ్ రౌండ్‌కీ సీన్ మారిపోతోంది. రిజల్ట్ అంతుబట్టడం లేదు. ఓవరాల్‌గా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తున్నా కూడా కొన్ని చోట్ల ఫలితం రౌండ్ రౌండ్‌కీ మారిపోతోంది. కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ వర్సెస్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ హోరా హోరీ నడుస్తోంది.
Telangana Results: తెలంగాణ ఎన్నికల్లో అధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో ఉండటంతో ఆ పార్టీ నేతలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుని బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కొన్ని చోట్ల ఐదో రౌండ్ పూర్తైంది. కరీంనగర్‌లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ హోరాహోరీ నడుస్తోంది. ఒక రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి గంగుల కమలాకర్ లీడ్‌లో ఉంటే.. మరో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ లీడ్‌లో కొనసాగుతున్నారు.