Home » Telangana » Assembly Elections
తెలంగాణ ఎన్నికల ఫలితాలు చిత్ర విచిత్రమైన ఫలితాలను అందిస్తున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్ వెనుకబడటమే షాక్‌ను కలిగిస్తుంటే.. మరోవైపు బీజేపీ కీలక నేతలంతా వెనుకబడిపోతుడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీజేపీ కీలక నేతలైన బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందనరావు వెనుకబడిపోయారు.
Telangana Results: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 10 స్థానాల్లో కాంగ్రెస్, 2 స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు శరవేగంగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ దూసుకుపోతోంది. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ మూడో స్థానానికి పడిపోయారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాల్లో కాంగ్రెస్ సీపీఐ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
Telangana Results: ఉమ్మడి మెదక్ జిల్లాలోని 11 నియోజకవర్గాలో బీఆర్‌ఎస్ 6 స్థానాల్లో, కాంగ్రెస్ ఐదు స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, జహీరాబాద్, సంగారెడ్డి, పఠాన్ చెరు స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
Telangana Results: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి కాంగ్రెస్ ఆధిక్యత చూపుతోంది. వార్ వన్‌సైడ్ అన్నట్టుగా తెలంగాణలో ఫలితాలు వస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతల్లో ఆనందరం వెల్లువిరిసింది.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు శరవేగంగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ దూసుకుపోతోంది. కారుకు బ్రేకులు పడుతున్నాయి.
Telangana Results: తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ఆధిక్యంలో నిలవగా.. ఈవీఎం ఓట్ల లెక్కింపులో కూడా మెజార్టీ నియోజకవర్గంలో హస్తం పార్టీ ముందంజలో ఉంది.
Telangana Results: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ముందంజలో ఉన్నారు.
తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రాష్ట్రమంతటా వన్ సైడెడ్‌గా ఫలితం వస్తోంది. అయితే ఆదిలాబాద్‌లో మాత్రం భిన్నమైన ఫలితాలు వెలువడుతున్నాయి. ఆ జిల్లాలో మూడు ప్రధాన పార్టీలు తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూర్, ముథోల్‌లో బీజేపీ అధిక్యంలో ఉంది.
Telangana Results: గోశామహల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ముందంజలో ఉన్నారు. తొలిరౌండ్‌లో 4004 ఓట్ల మెజార్టీతో రాజాసింగ్ ఆధిక్యంలో ఉన్నారు.