Share News

Telangana Election Results: వెనుకబడిపోయిన హేమాహేమీలు.. అయితే బీఆర్ఎస్ హవా ఎక్కడ కొనసాగుతోందో తెలుసా?

ABN , First Publish Date - 2023-12-03T10:46:35+05:30 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు శరవేగంగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ దూసుకుపోతోంది. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ మూడో స్థానానికి పడిపోయారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాల్లో కాంగ్రెస్ సీపీఐ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

Telangana Election Results: వెనుకబడిపోయిన హేమాహేమీలు.. అయితే బీఆర్ఎస్ హవా ఎక్కడ కొనసాగుతోందో తెలుసా?

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాలు శరవేగంగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ దూసుకుపోతోంది. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ మూడో స్థానానికి పడిపోయారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాల్లో కాంగ్రెస్ సీపీఐ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ జిల్లాలో 10 స్థానాల్లో కాంగ్రెస్, 02స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ముందంజలో ఉంది. వరంగల్ తూర్పు, పశ్చిమ, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, ములుగు, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉండగా.. స్టేషన్ ఘనపూర్, జనగామలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులె ముందంజలో ఉన్నారు.

ఇక పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెనుకబడటం ఆసక్తికరంగా మారింది. వరంగల్ తూర్పులో బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్ మూడవ స్థానానికి పరిమితమయ్యారు. సీతక్క, కొండా సురేఖ మాత్రం ముందంజలో కొనసాగుతున్నారు. ముందంజలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. ఇక వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి దూసుకెళుతున్నారు. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది.

సంగారెడ్డి నియోజకవర్గంలోని ఐదు నియోజకవర్గాల్లో సంగారెడ్డి, పఠాన్ చెరు, జహీరాబాద్‌లో బీఆర్‌ఎస్, నారాయణ ఖేడ్, ఆందోలు కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది. తుంగతుర్తి, వేములవాడలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. నిజామాబాద్ అర్బన్‌లో బీజేపీ, దేవరకొండలో కాంగ్రెస్, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చెన్నూరులో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ స్పష్టమైన అధిక్యంలో కొనసాగుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. హైదరాబాద్‌ జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. ఇక్కడ బీఆర్ఎస్ 8 చోట్ల, ఎంఐఎం 6 చోట్ల, కాంగ్రెస్ ఒక చోట లీడింగ్‌లో ఉన్నాయి.

Updated Date - 2023-12-03T11:58:23+05:30 IST