మహిళల భద్రతకు పకడ్బందీ చర్యలు

ABN , First Publish Date - 2021-09-19T04:03:00+05:30 IST

మహిళల రక్షణ, భద్రతకు పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా ఎస్పీ ఎం.రమణకుమార్‌ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం సొసైటీ ఫర్‌ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యనిర్వాహక కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ కంపెనీల రక్షణ, దొంగతనాల నివారణ కోసం సీసీకెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు.

మహిళల భద్రతకు పకడ్బందీ చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్‌

సీసీకెమెరాల ఏర్పాటుతో రక్షణ  

సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్‌


సంగారెడ్డి క్రైం, సెప్టెంబరు 18 : మహిళల రక్షణ, భద్రతకు పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా ఎస్పీ ఎం.రమణకుమార్‌ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం సొసైటీ ఫర్‌ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యనిర్వాహక కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ కంపెనీల రక్షణ, దొంగతనాల నివారణ కోసం సీసీకెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. పారిశ్రామిక ప్రాంతాలు, హైవేలపై ట్రాఫిక్‌ సమస్య నివారణ కోసం రోడ్ల విస్తరణ, ఆక్రమణల తొలగింపు, ట్రాఫిక్‌ వలంటీర్ల నియామకం తదితర చర్యలపై చర్చించారు. సంగారెడ్డి జిల్లా ట్రాఫిక్‌ పోలీసులు, హైవే అథారిటీలతో సెక్యూరిటీ కౌన్సిల్‌ ట్రాఫిక్‌ ఫోరం చేపట్ట వలసిన అభివృద్ధి చర్యలపై కూడా చర్చించారు. జిల్లాలోని అన్ని ఉత్పత్తి, ఫార్మా, లిక్కర్‌ కంపెనీలు, ప్రముఖ విద్యా సంస్థల ప్రతినిధులతో ఈ నెల 28న పటాన్‌చెరులోని ఎస్వీఆర్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో సాయంత్రం 4 గంటలకు సమన్వయ సమావేశం నిర్వహించాలని నిర్వణయించారు. ఈ సమావేశంలో  సొసైటీ ఫర్‌ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్‌ వైస్‌చైర్మన్‌ వి.రామ్‌మోహన్‌రెడ్డి, కార్యదర్శి పి.చందుకుమార్‌, కన్వీనర్‌, పటాన్‌చెరు డీఎస్పీ ఎస్‌.భీమ్‌రెడ్డి, ఉమెన్స్‌ ఫోరం జాయింట్‌ సెక్రెటరీ పరిణితసైకియా, ట్రాఫిక్‌ ఫోరం జాయింట్‌ సెక్రెటరీ సిహెచ్‌.రవి, అడిషనల్‌ ఎస్పీ కె.సృజన, డీఎస్పీ శ్రీనివా్‌సనాయుడు, ఐలా ప్రతినిధులు దుర్గాప్రసాద్‌, కాల రమేష్‌, ఎ.వెంకటేశ్వర్‌రావు, టి.సురేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-19T04:03:00+05:30 IST