నల్ల పోచమ్మ ఆలయ అభివృద్ధికి కృషి
ABN , First Publish Date - 2020-12-21T05:39:51+05:30 IST
మండలంలోని తునికి నల్ల పోచమ్మ ఆలయాభివృద్దికి తనవంతు సహకారాన్ని అదిస్తానని జడ్పీ చైర్‌పర్సన్ హేమలతా శేఖర్‌గౌడ్ తెలిపారు.
జడ్పీ చైర్‌పర్సన్ హేమలతా శేఖర్‌గౌడ్
కౌడిపల్లి, డిసెంబరు 20: మండలంలోని తునికి నల్ల పోచమ్మ ఆలయాభివృద్దికి తనవంతు సహకారాన్ని అదిస్తానని జడ్పీ చైర్‌పర్సన్ హేమలతా శేఖర్‌గౌడ్ తెలిపారు. ఆదివారం ఆమె తునికి నల్ల పోచమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారి వెంకట్‌రెడి, పూజారి శివప్ప ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.