లోపాలు అనేకం..!

ABN , First Publish Date - 2020-08-26T09:22:44+05:30 IST

శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రంలో అగ్నిప్రమాదంపై సీఐడీ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదంపై విచారణ జరిపేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు

లోపాలు అనేకం..!

  • విద్యుత్కేంద్రంలో సరిపడా అగ్నిమాపక పరికరాల్లేవ్‌
  • రెస్పాన్స్‌ టీంలూ లేవు.. అందుకే అగ్ని ప్రమాదం 
  • సీఐడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి
  • ఆ మేరకు ఎఫ్‌ఐఆర్‌లో మార్పులు
  • 3 రోజుల్లో మరోసారి ఘటనాస్థలానికి అధికార్లు


హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రంలో అగ్నిప్రమాదంపై సీఐడీ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదంపై విచారణ జరిపేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సీఐడీ అధికారుల బృందం రంగంలోకి దిగి.. ప్రమాద స్థలాన్ని పరిశీలించింది. తొలి రోజు పరిశీలనలోనే అనేక విషయాలు గుర్తించిన ట్లు తెలుస్తోంది. అనేక లోపాల కారణంగానే  ఈ ప్రమాదం జరిగిందని, సిబ్బంది రక్షణకు సరైన ఏర్పా ట్లు కూడా లేవనే విషయాన్ని అధికారులు గుర్తించా రు. ప్రమాదంపై స్థానిక పోలీస్‌ ేస్టషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లోనూ సీఐడీ పరిశీలన తర్వాత పలు మా ర్పులు చేయడమే అందుకు నిదర్శనం. కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడే ఇలా చేస్తారు. సీఐడీ పరిశీలన తర్వాత ఘటనా స్థంలంలో గుర్తించిన అంశాల ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌లో పలు సెక్షన్లు మార్చినట్లు సమాచారం. విద్యుదుత్పత్తి కేంద్రంలో అనుకోని ప్రమాదం జరిగితే మంటలు అదుపు చేసేందుకు సరైన పరికరాలు, ఏర్పాట్లు లేవనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది.


బ్యాటరీల్లో మంటలు అంటుకున్నప్పుడు సిబ్బంది మంటల్ని అదుపు చేేసందుకు చిన్నపాటి అగ్నిమాపక పరికరాల్ని ఉపయోగించడం వీడియోలో రికార్డు అయింది. అత్యవసర ద్వారాల నిర్వహణ సరిగా లేకపోవడం కూడా ప్రాణనష్టానికి కారణంగా గుర్తించిన సీఐడీ అధికారులు ఆ మేరకు విచారణ కొనసాగిస్తున్నారు. కాగా, విద్యుత్‌ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు మంటలు అదుపులోకి తేవడంతో పాటు మృతదేహాల్ని సొరంగం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. హైదరాబాద్‌ నుంచి సీఐఎ్‌సఎఫ్‌ బృందం వెళ్లిన తర్వాతే భూగర్భంలో ఉన్న మృతదేహాల్ని బయటకు తీసుకువచ్చారు. అంతటి ప్రమాదకరమైన ప్రాంతంలో స్పందన బృందాలు ఏర్పాటు చేయకపోవడాన్ని కూడా సీఐడీ అధికారులు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సీఐడీ చీఫ్‌ గోవింద్‌ సింగ్‌ నేతృత్వంలో గత శనివారం ఘటనాస్థలాన్ని సందర్శించిన అధికారుల బృందం రెండు, మూడు రోజుల్లో మరోసారి అక్కడికి వెళ్లనుంది. 


ఒక్కో కుటుంబానికి 3 కోట్లు ఇవ్వాలి: జేఏసీ

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో అగ్ని ప్రమాదాన్ని నివారించే యత్నంలో మృత్యువాత పడిన ఐదుగురు ఇంజనీర్లు, ఇద్దరు వర్క్‌మెన్లు, ప్రైవేట్‌ ఉద్యోగుల కుటుంబాలకు రూ.3 కోట్ల చొప్పున పరిహారం ఇవ్వాలని తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ సంయుక్త కార్యాచరణ కమిటీ (పవర్‌ జేఏసీ) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం సముచితంగా లేదని పేర్కొంది. ప్రమాదం తీవ్రతను తగ్గించడానికి చివరిదాకా యత్నించి, వేల కోట్ల నష్టాన్ని తగ్గించడంలో కీలకభూమిక పోషించి. ఉద్యోగులు బలిదానం ఇచ్చారని గుర్తు చేసింది. ఈ మేరకు మంగళవారం విద్యుత్‌ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డిని పవర్‌ జేఏసీ నాయకులు పి.రత్నాకర్‌రావు, పద్మారెడ్డి, శ్యామ్‌మనోహర్‌, సదానందం, లక్ష్మీనారాయణ, వేణు, సుఽధాకర్‌రెడ్డి, మేడి రమే్‌షలు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి వెంటనే తీసుకెళ్లి, పెంచేలా చూడాలని విజ్ఙప్తి చేశారు.

Updated Date - 2020-08-26T09:22:44+05:30 IST