ఎంపీ జీవీఎల్‌ను తన్నిన ఆవు..
ABN , First Publish Date - 2022-12-10T11:28:09+05:30 IST
బీజేపీ ఎంపీ జీవీఎల్‌ను ఓ ఆవు తన్నింది. నేడు మిర్చి ఎగుమతి దారుల అసోసియేషన్ కార్యాలయం ప్రారంభానికి గుంటూరుకు జీవీఎల్ వచ్చారు.

గుంటూరు : బీజేపీ ఎంపీ జీవీఎల్‌ను ఓ ఆవు తన్నింది. నేడు మిర్చి ఎగుమతి దారుల అసోసియేషన్ కార్యాలయం ప్రారంభానికి గుంటూరుకు జీవీఎల్ వచ్చారు. అక్కడే ఉన్న గృహప్రవేశం కోసం తెచ్చిన ఆవుకు దణ్ణం పెట్టేందుకు జీవీఎల్ వెళ్లగా అది తన్నింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండోసారి దణ్ణం పెట్టుకునేందుకు జీవీఎల్ యత్నించినా కూడా గోమాత తన్నబోవడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.