Galla Jayadev: అమరావతిపై కేంద్రానికి ప్రశ్నల వర్షం
ABN , First Publish Date - 2022-12-15T16:23:22+05:30 IST
ఒక్క ప్రాజెక్టును కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయిందని కేంద్రాన్ని నిలదీశారు. ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోవడానికి సరైన కారణాలు చెప్పలేక
ఢిల్లీ: అమరావతి (Amaravati) నిర్మాణంపై పార్లమెంటులో తెలుగు దేశం ఎంపీ గల్లా జయదేవ్ (Tdp MP Galla Jayadev) గళం విప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో స్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టాల్సిన పనుల సంగతేంటని గల్లా ప్రశ్నించారు. ఒక్క ప్రాజెక్టును కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయిందని కేంద్రాన్ని నిలదీశారు. ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోవడానికి సరైన కారణాలు చెప్పలేక కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ(Minister Union Minister Hardeep Singh Puri) తడబడ్డారు. అమరావతిలో మొత్తం 21 ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రూ.2046 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు. కేంద్రం వాటాగా రూ.488 కోట్లు కూడా విడుదల చేసిందని వెల్లడించారు. కేంద్రం నిధులిచ్చినా పెద్దగా చెప్పుకునే విధంగా అక్కడ పనులు మాత్రం జరగలేదని మంత్రి స్పష్టం చేశారు. పనులు పూర్తికాకపోవడానికి కారణాలను మాత్రం వివరించలేకపోయారు.