Inter Students Problems: సత్తెనపల్లిలో వింత పరిస్థితిని ఎదుర్కొన్న ఇంటర్ స్టూడెంట్స్
ABN , Publish Date - Mar 01 , 2025 | 12:05 PM
Inter Students Problems: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా విద్యార్థులు పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. పరీక్షా కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యంతో స్టూడెంట్స్ కాసేపు ఆందోళనకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పల్నాడు, మార్చి 1: రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు (శనివారం) ఇంటర్మీడియట్ ప్రభుత్వ పరీక్షలు (Inter Exams) ప్రారంభమయ్యాయి. అయితే పలు చోట్ల అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు (Students) ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులు అర్ధగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. తీరా అక్కడకు చేరుకున్నాక అధికారుల తీరుతో పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవ్వాల్సి వచ్చింది. పరీక్షా కేంద్రాల వద్ద సరైన సమాచారం లేకపోవడంతో స్టూడెంట్స్ పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. పరీక్ష సమయంలో అధికారులు ఇలాగేనా ప్రవర్తించేది అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇంతకీ పరీక్షా కేంద్రాల వద్ద ఏం జరిగింది.. విద్యార్థులు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కున్నారో ఇప్పుడు చూద్దాం.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఇంటర్ విద్యార్థులు పరీక్షా కేంద్రాలలో అయోమయానికి గురయ్యారు. హాల్ టికెట్‌లో ఉన్న అడ్రస్ ఒకచోట.. పరీక్ష కేంద్రం మరొకచోట ఉండటంతో ఒకింత విస్మయానికి గురయ్యారు విద్యార్థులు. హాల్ టికెట్‌లో ఉన్న అడ్రస్ ప్రకారం పరీక్షా కేంద్రానికి వెళ్తే... పరీక్ష కేంద్రం వేరే చోటికి మార్చారనే బోర్డు అక్కడ దర్శనమిచ్చింది. దీంతో విద్యార్థులు ఉరుకుల పరుగులతో పరీక్షా కేంద్రానికి పరుగులు తీశారు. పరీక్షా కేంద్రం మార్చారని విద్యార్థులకు అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతోనే ఇలాంటి స్థితి ఏర్పడింది. అధికారుల తీరు పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పరీక్షా కేంద్రం మార్చడం వల్ల అక్కడకు వెళ్లేలోపు సమయం మించి పోతే బాధ్యత ఎవరు తీసుకుంటారని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ముఖ్యమైన పరీక్షల సమయంలో అధికారులు ప్రవర్తించిన తీరు ఏమీ బాగోలేదని, పరీక్ష కేంద్రం మార్పుపై ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ అధికారులను తల్లిదండ్రులు నిలదీశారు.
CM Chandrababu: ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు వరాలు
సరైన సమాచారం లేక...
అటు గుంటూరు జిల్లాలోనూ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇంటర్ పరీక్షల ఏర్పాట్లలో లోపాలతో స్టూడెంట్స్ అవస్థలకు గురయ్యారు. పరిక్షా కేంద్రాల వద్ద సరైన సమాచారం లేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఉమెన్స్ కాలేజీలో సరైన సమాచారం ఇవ్వలేదు అధికారులు. దీంతో కాలేజ్‌లో ఏ గది ఎటు ఉందో తెలియక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కాలేజీ సిబ్బంది తీరుపై తల్లిదండ్రులు ఆసహనం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
Vehicle Tracking: వాహనం ఆచూకీ ఇక పక్కా!
Tunnel Rescue Operations: టన్నెల్ వద్ద టెన్షన్ టెన్షన్.. కీలక దశకు రెస్క్యూ ఆపరేషన్
Read Latest Telangana News And Telugu News